AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

అత్యవసరంగా ప్రయాణం పడింది.. కానీ చేతిలో టికెట్ లేదు. తత్కాల్ ట్రై చేస్తే సెకన్ల వ్యవధిలో వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. ఇక రైలు ప్రయాణం క్యాన్సిల్ అనుకుంటున్నారా? అయితే రైలు బయలుదేరడానికి కేవలం కొన్ని గంటల ముందు కన్ఫర్మ్‌డ్ టికెట్ పొందే ఒక అదిరిపోయే సీక్రెట్ ఆప్షన్ ఐఆర్‌సిటిసిలో ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రైలు బయలుదేరే చివరి నిమిషంలో కన్ఫార్మ్ టికెట్.. ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
How To Get Confirmed Train Tickets Last Minute
Krishna S
|

Updated on: Aug 08, 2026 | 7:53 AM

Share

అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావడం.. కానీ రైలు టికెట్ దొరక్కపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అలాంటి సమయంలో తత్కాల్ టికెట్లు కూడా లభించకపోతే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఐఆర్‌సిటిసి ఒక ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా లాస్ట్ మినిట్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యమే కరెంట్ రిజర్వేషన్. ఈ ఫీచర్ ద్వారా రైలు బయలుదేరడానికి కొన్ని గంటల ముందు కూడా కన్ఫర్మ్‌డ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ బుకింగ్ ఎలా పనిచేస్తుంది, దీని నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కరెంట్ బుకింగ్ అంటే ఏమిటి?

సాధారణంగా రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేస్తారు. ఈ చార్ట్ తయారైన తర్వాత కూడా రైలులో ఖాళీగా ఉన్న బెర్తులు, సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచే ప్రక్రియనే కరెంట్ రిజర్వేషన్ అంటారు.

కరెంట్ టికెట్ బుక్ చేసుకోవడం ఎలా?

ఐఆర్‌సిటిసి యాప్, వెబ్‌సైట్ ద్వారా: IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, మీరు వెళ్లాలనుకున్న రూట్, రైలును ఎంచుకుంటే Current Booking ఆప్షన్ కనిపిస్తుంది. సీట్లు ఖాళీగా ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లోనే కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్వే స్టేషన్ కౌంటర్ ద్వారా: ప్రయాణించే స్టేషన్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ వద్దకు వెళ్లి నేరుగా కరెంట్ బుకింగ్ టికెట్ పొందవచ్చు.

ఈ ఫీచర్ ముఖ్యమైన నిబంధనలు

సమయం: రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ఈ బుకింగ్ ప్రారంభమై, రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటుంది.

కేవలం కన్ఫర్మ్‌డ్ టికెట్లు మాత్రమే: కరెంట్ బుకింగ్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉండవు. ఖాళీ ఉన్న సీట్లకు మాత్రమే నేరుగా కన్ఫర్మ్ టికెట్ ఇస్తారు.

బోర్డింగ్ పాయింట్ మార్పు ఉండదు: కరెంట్ టికెట్ బుక్ చేశాక బోర్డింగ్ పాయింట్, ప్రయాణికుల పేరు లేదా వయస్సు మార్చుకోవడానికి వీలుండదు.

రద్దీ లేని సమయాల్లో అనుకూలం: పండుగలు లేని సాధారణ రోజుల్లో లేదా దూరప్రాంత రైళ్లలో ఈ ఆప్షన్ ద్వారా సులభంగా టికెట్లు లభిస్తాయి.

ఆకస్మిక ప్రయాణ ప్రణాళికలు ఉన్నప్పుడు ఏజెంట్లను ఆశ్రయించకుండా లేదా తత్కాల్ రద్దీలో ఇబ్బంది పడకుండా ఐఆర్‌సిటిసి కరెంట్ బుకింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం చాలా సులభమైన, చౌకైన మార్గం.

Follow Us