AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..! త్రి సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి ఈమేనా.!! ఎంత మారిపోయింది

తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ధనుష్. ఇప్పటివరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది

వారెవ్వా..! త్రి సినిమాలో శ్రుతిహాసన్ చెల్లి ఈమేనా.!! ఎంత మారిపోయింది
3movie
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2026 | 9:37 AM

Share

తమిళ స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి, ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ధనుష్. ధనుష్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ డైరెక్టర్స్ తోనే కాదు చిన్న, కొత్త దర్శకులతోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు ధనుష్. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నారు ధనుష్. విభిన్నమైన కథతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ధనుష్. రీసెంట్‌గా రాయన్ మూవీకి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు ధనుష్. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే ధనుష్ నటించిన త్రీ మూవీ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా అంతగా ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ టీవీలో సూపర్ హిట్ గా నిలిచింది. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా శ్రుతిహాసన్ అదరగొట్టేసింది. ఈ మూవీలో ధనుష్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో టీనేజ్ ప్రేమకథను కూడా చూపించారు. ఇక ఈ మూవీతో శ్రుతిహాసన్ చెల్లిగా నటించిన ఆర్టిస్ట్ గుర్తుందా.?

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. ఆ అందాల భామ  పేరు గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్‌తో అదరగొట్టేస్తుంది. చిన్నవయసులోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన గాబ్రియెల్లా.. బాలనటిగా అదరగొట్టేసింది. అలాగే పలు డాన్స్ రియాల్సిటీ షోలతోనూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే త్రీ సినిమాలో నటించే చాన్స్ అందుకుంది. ఆ మూవీలో శ్రుతి చెల్లిగా కనిపించింది. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ