AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara:మాస్ మసాలా సినిమాగా రానున్న నేచురల్ స్టార్ మూవీ .. ఆశలన్నీ దసరా సినిమా పైనే..

తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది.

Dasara:మాస్ మసాలా సినిమాగా రానున్న నేచురల్ స్టార్ మూవీ .. ఆశలన్నీ దసరా సినిమా పైనే..
Dasara
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 6:59 AM

Share

నేచురల్ స్టార్ నాని మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది దసరా సినిమా అనే చెప్పాలి. నాని తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్‌లుక్‌, ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ ఈ సినిమా పక్కా మాస్‌ మూవీ అని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నేను లోకల్‌’ సినిమా తర్వాత ఈ జంట కలిసి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం.  ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కంటే ముందు నాని  ‘టక్ జగదీష్’.. ‘శ్యామ్ సింగరాయ్’ లో ‘అంటే సుందరానికి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

వీటిలో సుపూర్ హిట్ గా నిలిచిన సినిమా శ్యామ్ సింగరాయ్ మాత్రమే. ఇక ఇప్పుడు ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నడు. నాని మాస్ హీరోగా రాణించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. దీంతో తన తదుపరి చిత్రాలకు ప్రస్తుతానికి సైన్ చేయడం లేదట. ఈ మూవీ బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిపోతున్నా నిర్మాతలను సర్దుబాటు చేయమని కోరుతున్నాడని టాక్. ఇప్పటిదాకా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మాస్ ఇమేజ్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాడు నాని.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..