AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent Movie: బడా హీరోలకు పోటీగా కుర్ర హీరో సినిమా.. ఏజెంట్ పై అంత నమ్మకమా..!

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది. మొన్నామధ్య ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. కన్నడ టీజర్‌ను హీరో కిచ్చా సుదీప్ లాంచ్ చేయగా తమిళ్ టీజర్ ను శివకార్తికేయన్ విడుదల చేశారు

Agent Movie: బడా హీరోలకు పోటీగా కుర్ర హీరో సినిమా.. ఏజెంట్ పై అంత నమ్మకమా..!
Akhil
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2022 | 7:57 AM

Share

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. అఖిల్ ఈ సినిమాలో ఏజెంట్ గా కనిపించనున్నాడు . సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది. మొన్నామధ్య ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. కన్నడ టీజర్‌ను హీరో కిచ్చా సుదీప్ లాంచ్ చేయగా తమిళ్ టీజర్ ను శివకార్తికేయన్ విడుదల చేశారు. టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. ఇక అఖిల్‌ ఆహార్యం, చెప్పిన డైలాగులు అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌హాప్‌ తమీజా స్వరాలు సమకూరుస్తున్నారు

ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ”ఏజెంట్” కూడా బరిలో దిగుతున్నట్లు అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ప్రభాస్ – మెగాస్టార్ చిరంజీవి – నటసింహం బాలయ్యలాంటి బడా హీరోల సినిమాల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది. నిజానికి ఈ సినిమా 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరగలేదు. ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి బరిలో దిగుతోంది.

ఇవి కూడా చదవండి

ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. ఈసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ & టీజర్ కు ట్రేడ్ మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us
అడవిలో అరుదైన ముఖాముఖి! చివరికి జరిగింది ఇదే..!
అడవిలో అరుదైన ముఖాముఖి! చివరికి జరిగింది ఇదే..!
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు