AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: ఇన్‌స్టాగ్రామ్ లో మరో అదిరిపోయే ఫీచర్.. పాటల ప్రియులకు ఇక పండగే..

సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ తమ వినియోగదారులకు మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. అంతర్గతంగా డెవలప్..

Social Media: ఇన్‌స్టాగ్రామ్ లో మరో అదిరిపోయే ఫీచర్.. పాటల ప్రియులకు ఇక పండగే..
Instagram New Feature
Amarnadh Daneti
|

Updated on: Oct 25, 2022 | 8:04 PM

Share

సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ తమ వినియోగదారులకు మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదు. అంతర్గతంగా డెవలప్ మెంట్ దశలో ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ యాడ్ చేసుకునేందుకు వీలు కల్పించేలా ఒక ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రొఫైల్ పేజీలో యూజర్స్ బయో కింద యాడ్ చేసుకున్న సాంగ్ కనిపిస్తుంది. త్వరలో రాబోయే ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ప్రోటోటైప్‌గా ఉంది. ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ఇన్‌స్టాగ్రామ్ అధికార ప్రతినిధి ఒకరు దీనిని ధ్రువీకరిస్తూ ఇంటర్నల్ ప్రోటోటైప్‌గా ఉందని, ఇంకా బీటా టెస్టింగ్‌కు రాలేదని వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లోని ప్రొఫైల్‌కు పాటలు జత చేసే సౌకర్యాన్ని ఇస్తున్న సామాజిక మాద్యమ సంస్థల్లో ఇన్‌స్టాగ్రామ్ మొదటిది అయితే మాత్రం కాదు. మైస్పేస్ సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్స్ చాలా ఏళ్ల కిందే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇన్ స్టాగ్రామ్ లో ప్రొఫైల్ కు పాట యాడ్ చేసుకునే ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్ లైబ్రరీ నుంచి గానీ, థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గానీ సాంగ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ఇన్ స్టాగ్రామ్ యాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు వాళ్లు ఇంకో ఖాతా క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ చేసినప్పుడు ఆ యూజర్ ఏ ఖాతా క్రియేట్ చేసిన ఇక మిమ్మల్ని ఫాలో కాలేరు. కనెక్ట్ కాలేరు. ఎవరినైనా కావాలని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారి ఇబ్బందుల నుంచి ఈ యాప్ రక్షణ కల్పిస్తుంది. నచ్చని పదాలతో కూడిన కామెంట్స్ ఎవరైనా చేస్తే హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ ద్వారా ఆ కంటెంట్‌ను తొలగించివేస్తుంది. దాదాపు 40 శాతం కామెంట్లు నేరపూరితమైన కంటెంట్‌గా ఉంటున్నాయని భావించి ఇన్ స్టాగ్రామ్ సంస్థ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

కంపెనీ ఈ హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్‌ను క్రియేటర్ అకౌంట్స్‌లో ఆటోమేటిగ్గా ఆన్‌లో ఉండేలా చేసి పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ ఫీచర్‌ను ఏ యూజర్ అయినా ఆన్ లేదా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. తమకు నచ్చని కంటెంట్‌కు సంబంధించిన పదాలను, వాక్యాలను, ఎమోజీలను ఈ ఫీచర్‌కు జతచేస్తే ఆ కంటెంట్‌తో కూడిన కామెంట్లు ఆటోమెటిక్ గా డిలీట్ అయిపోతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..