Good Luck Sakhi Movie Review: ప్రేక్షకుల చేత “గుడ్” అనిపించుకుంటున్న ‘గుడ్ లక్ సఖి’ ..

అందాల భామ కీర్తిసురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.

Good Luck Sakhi Movie Review: ప్రేక్షకుల చేత గుడ్ అనిపించుకుంటున్న 'గుడ్ లక్ సఖి' ..
Good Luck Sakhi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2022 | 12:57 PM

నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ

దర్శకత్వం : నగేష్ కుకునూర్

నిర్మాత: సుధీర్ చంద్ర ప‌దిరి

సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్

అందాల భామ కీర్తిసురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. అలాగే ఈ మూవీకు రాక్ స్టార్ దేవేశీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. నిజానికి సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

సఖి (కీర్తి సురేష్) ఓ పేద కుటుంబానికి చెందిన ఒక సాదారణమైన యువతి. అయినా తనకి ఓ టాలెంట్ ఉంది. చిన్నప్పటి నుండి దేనినైనా గురి చూసి కొట్టగొలదు. సఖి స్నేహితుడు గోళీ రాజు ( ఆది పినిశెట్టి) చిన్నతనం నుంచే సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెలో నమకాన్ని పెంచుతాడు. ఎప్పుడు ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఊరంతా సఖిని బ్యాడ్ లక్ సఖి అని అంటుంటారు.. ఈ క్రమంలో దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయడానికి ఆ ఊరు వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. అక్కడి నుంచి సఖి లైఫ్ ఎలా మారింది.? ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంది.? మొత్తంగా ఓ అతి సాధారణ అమ్మాయి దేశం గర్వించదగ్గ షూటర్ గా ఎలా ఎదిగింది ? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : 

కీర్తి సురేష్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొత్తేమీ కాదు గతంలో ఆమె పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలు చేసింది. అదే ఈజ్ తో ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. నటన పరంగా కీర్తి సురేష్ మెప్పించింది. ఈ సినిమా కోసం కాస్త బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ స్లిమ్ గా మారింది. దాంతో ఈ సినిమాలో కీర్తి కొత్తగా కనిపించింది. అలాగే కల్నల్ పాత్రలో నటించిన జగపతి బాబు కూడా ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఆదిపినిశెట్టి నటన కూడా మెప్పిస్తుంది. రఘుబాబు, రాహుల్ రామకృష్ణ కామెడీ డైలాగ్స్ నవ్వులు తెప్పించాయి. దేవీశ్రీ అందించిన  పాటలు కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, తను అనుకున్న డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించాడు. అలాగే సినిమాని విజువల్ గా ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

చివరకు : 

ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో గుడ్ లక్ సఖి “గుడ్” అనిపించుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajamouli: బ్లడ్ క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆర్టిస్ట్.. ఆదుకోవాలంటూ డైరెక్టర్ రాజమౌళి విజ్ఞప్తి..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Megastar Chiranjeevi: క్వారంటైన్‏లో ఉన్నాను అందుకే నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..