AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా

Celebrities Best Buddies: ఎవరు ఏ రంగంలో ఉన్నా చిన్ననాటి స్నేహం(Childhood Friendship) .. తీపి జ్ఞాపకమే.. అయితే కొంతమంది మాత్రం తమ బాల్య స్నేహాన్ని కొనసాగిస్తూ.. ఒకే స్కూల్ లో చదువుకుంటారు..

Best Buddies: నాటి చిన్న నాటి స్నేహితులు.. క్లాస్ మేట్స్.. నేడు సెలబ్రేటీలు.. ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా
Celebrities Best Buddies
Surya Kala
|

Updated on: Jan 29, 2022 | 12:46 PM

Share

Celebrities Best Buddies: ఎవరు ఏ రంగంలో ఉన్నా చిన్ననాటి స్నేహం(Childhood Friendship) .. తీపి జ్ఞాపకమే.. అయితే కొంతమంది మాత్రం తమ బాల్య స్నేహాన్ని కొనసాగిస్తూ.. ఒకే స్కూల్ లో చదువుకుంటారు.. పెరిగి పెద్ద అయ్యాక కూడా కొంతమంది ఆ స్నేహాన్ని కంటిన్యు చేస్తూ ఒకే ప్లేస్ లో పని చేస్తారు.. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది. ఇక సినీ పరిశ్రమలో అలా ఒకే స్కూల్ లో చదువుకుని.. పెరిగి పెద్ద సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. తమకంటూ ఒక ఫేం ని సంపాదించుకున్నవారున్నారు. చిన్న‌ప్పుడు క్లాస్‌మెట్స్‌ నేడు ఇండ‌స్ట్రీ స్టార్లు. వారు ఎవరో తెలుసుకుందాం..

చిన్ననాటి స్నేహం క్లాస్ మేట్స్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది.. టాలీవుడ్ హీరోలైన రామ్ చరణ్, రానా, శర్వానంద్ త్రయం. ఈ ముగ్గురు కలిసి హైద‌రాబాద్ బేగంపేట‌లో ఉన్న హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్లో క‌లిసి చ‌దువుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనదైన శైలిలో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. దగ్గుబాటి వారి వారసుడిగా రానా కూడా టాలీవుడ్ బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. శర్వానంద్ కూడా హీరోగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఎటువంటి సిని నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని.. బుల్లి తెరపై సుమ తర్వాత అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న యాంకర్ ప్రదీప్ కూడా చిన్ననాటి స్నేహితులు. హీరో నాని, యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు క్లాస్‌మెట్స్‌. హైద‌రాబాద్‌లోని సెంట్ అల్పోన్సా స్కూల్లో క‌లిసి చ‌దువుకున్నారు. అంతేకాదు నాని, ప్రదీప్ ఇద్దరూ స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి సోది కబుర్లు చెప్పుకుంటూ.. సరదాగా గడిపేసేవారట. తమ స్నేహం, చదువు గురించి స్వయంగా నాని, ప్ర‌దీప్ లు ఒకానొక సందర్భంలో చెప్పారు. ఇండ‌స్ట్రీలో నానితో పాటు ప్ర‌దీప్ ఇద్ద‌రూ మంచి పొజిష‌న్లేనే ఉన్నారు.

ఇక అక్కినేని సుమంత్ ఏపీ సిఎం జగన్ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వీరిద్దరు ఒకే క్లాస్.. ఒకే బెంచ్. స్కూల్ డేస్ లో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదట. సుమంత్, జగన్ ఇద్దరూ కలిసి సాయంత్రాలు చట్టపట్టాలేసుకుని రాత్రి వరకూ తిరగడం.. రాత్రి ఇంట్లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం వంటి అనేక స్వీట్ మెమరీస్ ఇద్దరి స్నేహంలో ఉన్నాయట.

బాలీవుడ్‌లో స్టార్ హీరోలైన కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ లు కూడా స్కూల్ మేట్స్ అట. ఈ ఇద్ద‌రు బాలీవుడ్ లో హీరోలుగా అడుగు పెట్టి… చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నారు. వీరు మాత్రమే కాదు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ లు కూడా చిన్నతనంలో క్లాస్ మేట్స్.. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్నారు. తమ స్నేహం కొనసాగిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ , భారత క్రికెటర్ విరాట్ భార్య అనుష్క శ‌ర్మ‌, టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ భార్య సాక్షిలు సైతం చిన్న తనలో క్లాస్‌మేట్స్‌. వీరిద్దరూ పెద్ద‌య్యాక టీం ఇండియా టాప్ క్రికెట‌ర్ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.

Also Read:   వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య