AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రోచేవారెవరురా..! మూవీ రివ్యూ..

సినిమా టైటిల్ : బ్రోచేవారెవరురా..! నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేతా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ దర్శకత్వం : వివేక్ ఆత్రేయ సంగీతం : వివేక్ సాగర్ నిర్మాతలు : విజయ్ కుమార్ మన్యం శ్రీ విష్ణు, నివేదా థామస్ తదితరులు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, నిర్మాతగా విజయ్ కుమార్ మన్యం వ్యవహరించారు. క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ […]

బ్రోచేవారెవరురా..! మూవీ రివ్యూ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 3:49 PM

Share

సినిమా టైటిల్ : బ్రోచేవారెవరురా..!

నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేతా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ

దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

సంగీతం : వివేక్ సాగర్

నిర్మాతలు : విజయ్ కుమార్ మన్యం

శ్రీ విష్ణు, నివేదా థామస్ తదితరులు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, నిర్మాతగా విజయ్ కుమార్ మన్యం వ్యవహరించారు. క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ విష్ణు ఎప్పుడూ విచిత్రమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో సిద్ధహస్తుడు. తన క్యారెక్టర్‌కు ఒక మార్క్ ఉండాలనుకుంటాడు. మరి ఈ సినిమాలో విష్ణు ఎలాంటి పాత్రలో నటించాడో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే..! ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..! మరి అది ఎలా ఉందో చూసేద్దామా..!

కథ :

సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ మంచి ఫ్రెండ్స్. ఇంటర్ మూడు సార్లు ఫెయిల్ అయి.. ఇంకా చదువుతూనే ఉంటారు. అల్లరి చిల్లరిగా తిరిగే గ్యాంగ్. ఈ నేపథ్యంలోనే నివేదా ఎంటర్ అవుతుంది. నివేదాకి లైన్ వేస్తాడు శ్రీ విష్ణు. అయితే.. నివేదా చదివే కాలేజీకి తన తండ్రే ప్రిన్సిపాల్. నివేదాకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడతాడు. అవి ఇష్టంలేని నివేదా ఈ గ్యాంగ్‌తో స్నేహం చేస్తుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. నివేదా తన తండ్రికి దూరంగా వెళ్లిపోవలసి వస్తుంది. ఈ క్రమంలో శ్రీ విష్ణు బ్యాచ్ నివేదకు ఎలా సహాయం చేశారు..? ఆ సమస్యల నుంచి ఈ బ్యాచ్ ఎలా బయటపడింది..? అసలు నివేదా తన తండ్రిని వదిలి ఎందుకు వెళ్లిపోవలసి వస్తుంది..? వాళ్ల లైఫ్ ఎలా టర్న్ అయ్యింది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే :

ఎప్పటిలాగే శ్రీ విష్ణు, నివేదా, ప్రియదర్శి, సత్యదేవ్, పేతురాజ్, రాహుల్ తదితరులు వాళ్ల పాత్రలకు తగ్గట్టుగా వాటికి న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా సెకండాఫ్ సన్నివేశాలు వాళ్ల నటనతో థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించారు. అలాగే నివేద తన నటన, అభినయంతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అల్లరి చిల్లరి గ్యాంగ్‌గా శ్రీ విష్ణు, ప్రియదర్శి అలరించారనే చెప్పాలి. ఇక నివేదా తండ్రి పాత్రలో నటించిన నటుడు జీవించాడనే చెప్పాలి.

ఎలా ఉందంటే :

సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌కి ఈ సినిమా చక్కగా సరిపోతుంది. నివేదా యాక్టింగ్‌నే ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ.. అలాగే.. కిడ్నాప్ సన్నివేశాలు, అదేవిధంగా మంచి చేయబోయిన ముగ్గురు ఆకతాయి కుర్రాళ్ళు అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే వాళ్లు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. అయితే.. ఇందులో ఒక పాప క్యారెక్టర్ సినిమాకి టర్నింగ్ పాయింట్‌ అనే అనాలి. అలాగే.. అల్లరి బ్యాచ్ ఇక్కట్లు, వాళ్ల ఫీలింగ్స్.. పండాయి. ఇక ఈ సినిమాలోని కామెడీ, అలాగే క్లైమాక్స్‌లోని సన్నివేశాలు ఎమోషనల్ కంటెంట్‌ను డైరెక్టర్ వివేక్ తెరకెక్కించిన వైనం ఆకట్టుకుంది.

మొత్తానికి ఈ సినిమా కామెడి, సస్పెన్స్‌ను అందించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

Follow Us
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ