AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కల్కి’ మూవీ రివ్యూ..!

టైటిల్ : ‘కల్కి’ తారాగణం : రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ తదితరులు సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రశాంత్ వర్మ విడుదల తేదీ: 28-06-2019 యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ […]

'కల్కి' మూవీ రివ్యూ..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 4:36 PM

Share

టైటిల్ : ‘కల్కి’

తారాగణం : రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

విడుదల తేదీ: 28-06-2019

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

80వ దశకంలో తెలంగాణలోని కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే(అశుతోష్ రాణా), అతని శత్రువులు మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక అలా జరిగిన ఓ గొడవలో ఎమ్మెల్యే తమ్ముడు శేఖర్ బాబును ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు ఆఫీసర్ కల్కి(రాజశేఖర్). ఇక కేసు గురించి లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న కల్కికి.. ఆ హత్య చుట్టూ దాగి ఉన్న ఎన్నో నిజాలు బయటపడతాయి.

అసలు ఆ హత్య చేసింది ఎవరు.? హత్య చుట్టూ దాగి ఉన్న నిజాలు ఏంటి.? కల్కి వాటిని ఎలా బయటపెట్టాడు.?అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సీనియర్ హీరో రాజశేఖర్ టైటిల్ రోల్‌లో ఎప్పటిలానే మంచి నటన కనబరిచాడు. అతని టైమింగ్‌తో పలు సీన్స్‌లో కామెడీని చక్కగా పండించాడు. జర్నలిస్ట్ పాత్రలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్లు ఆదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడలు అటు గ్లామర్, ఇటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిద్దు జొన్నలగడ్డ, అశుతోష్ రాణా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కల్కి’ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ సినిమా నిడివి. దాదాపు 2 గంటల 20 నిముషాలు ఉన్న ఈ సినిమా స్లో-నేరేషన్ వల్ల ప్రేక్షకులు మూడు గంటలుగా ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగతీతగా అనిపించినా ఇంటర్వెల్‌ను మాత్రం అద్భుతమైన ట్విస్ట్‌తో పూర్తి చేస్తాడు దర్శకుడు. ఇకపోతే ఆదా శర్మ నటించిన కొన్ని అనవసర సీన్స్ బోర్ కొట్టకుండా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. సినిమాకు మరో మైనస్ పాయింట్.. కథలో వచ్చే పాత్రలు.. దర్శకుడు ప్రవేశపెట్టిన చాలా క్యారెక్టర్స్ ప్రేక్షకులను సతమతం చేయడం తప్ప.. థ్రిల్ ఏమి కనబడలేదు. ఈ సినిమాకి ప్రధాన బలం రెండో భాగం. ముఖ్యంగా చివరి 15 నిమిషాల్లో దర్శకుడు రివీల్ చేసిన అన్ని ట్విస్ట్స్ బాగుంటాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ బాగున్నప్పటికీ స్క్రీన్ మీద చూపించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు. అతని మొదటి సినిమా ‘అ’ మాదిరిగానే ఈ సినిమా ఉంటుందని భావించిన సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగింగ్  చేస్తూ తెరకెక్కించాడు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

ప్రధాన పాత్రధారుల నటన

సెకండ్ హాఫ్

మైనస్‌ పాయింట్స్‌ :

ఫస్ట్ హాఫ్, సాగదీతీత సన్నివేశాలు

Follow Us