Tollywood: అమాయకపు చిరునవ్వుల చిన్నోడు.. పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోను గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ హీరో.. అప్ కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో తోపు హీరో. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నటన, డ్యాన్స్, స్టైల్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 1, పుష్ప 2 వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించి, అన్ని కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో వరల్డ్ వైడ్ అల్లు అర్జున్ పేరు మారుమోగింది.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..
ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. డ్యాన్స్ అయినా, యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, కామెడీ అయినా, ప్రతి నటనలోనూ మెప్పించారు. 2003లో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన బన్నీ.. 2004లో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆర్య’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్ మార్చేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.
ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఆర్య 2, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ వంటి హిట్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే కథనాయికగా నటిస్తుంది. అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ జన్మించిన సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..
