AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే.. నిపుణుల హెచ్చరిక!

మనం చేసే ప్రతి వంటకంలో కరివేపాకు (Curry Leaves) ఉండాల్సిందే. కేవలం రుచి కోసమే కాకుండా, ఇందులోని ఔషధ గుణాల వల్ల దీనిని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. అయితే, అందరికీ కరివేపాకు సరిపడదని మీకు తెలుసా..?అవును, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు వీటిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Jyothi Gadda
|

Updated on: Apr 07, 2026 | 10:19 AM

Share
లో-షుగర్ సమస్య ఉన్నవారు: కరివేపాకు సహజంగానే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలు చేసినప్పటికీ, ఇప్పటికే షుగర్ లెవల్స్ తక్కువగా ఉండేవారు దీనిని ఎక్కువగా తింటే హైపోగ్లైసీమియా స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం రావచ్చు.

1 / 5
తీవ్రమైన అలెర్జీలు: కొంతమందికి కొన్ని రకాల ఆకులు లేదా సుగంధ ద్రవ్యాల వల్ల అలెర్జీ కలుగుతుంది. కరివేపాకు తిన్న తర్వాత శరీరంలో దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే వాడటం ఆపివేయాలి.

2 / 5
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు: గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల శరీరం సెన్సిటివ్‌గా ఉంటుంది. కరివేపాకు రసాన్ని లేదా అధికంగా కరివేపాకు పొడిని తీసుకోవడం వల్ల కొందరిలో వికారం లేదా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే పరిమితంగా వాడటం శ్రేయస్కరం.

3 / 5
జీర్ణకోశ సమస్యలు: కరివేపాకు జీర్ణక్రియకు మంచిదే కానీ, అల్సర్లు లేదా తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పచ్చి కరివేపాకును నేరుగా నమలడం వల్ల కడుపులో ఇరిటేషన్ కలిగే అవకాశం ఉంది.

4 / 5
 కిడ్నీ బాధితులు: కొన్ని అధ్యయనాల ప్రకారం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు లేదా డయాలసిస్ మీద ఉన్నవారు అధిక మొత్తంలో మూలికా పరమైన పదార్థాలను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. కరివేపాకులో ఉండే కొన్ని మూలకాలు వారి చికిత్సపై ప్రభావం చూపవచ్చు.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా