AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్.. పక్కనే ఉండి నవ్వుకున్న ఇషాన్ కిషన్

Viral Video : హైదరాబాద్ బిర్యానీ ఘాటుకు ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇషాన్ కిషన్‌తో కలిసి బిర్యానీ తింటుండగా జరిగిన ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సరదా దృశ్యాన్ని నితీష్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Viral Video : హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్.. పక్కనే ఉండి నవ్వుకున్న ఇషాన్ కిషన్
Heinrich Klaasen
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 10:49 AM

Share

Viral Video : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంటే మైదానంలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని మనందరికీ తెలుసు. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ సౌతాఫ్రికా వీరుడు, ఇప్పుడు ఒక బిర్యానీ ప్లేట్ ముందు మాత్రం చేతులెత్తేశాడు. మన హైదరాబాద్ బిర్యానీ రుచి చూద్దామని వెళ్లిన క్లాసెన్, అది ఎంత ఘాటుగా ఉంటుందో తెలియక అల్లాడిపోయాడు. దీనికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడైన హెన్రిచ్ క్లాసెన్, తన సహచర ఆటగాడు, ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి అసలైన హైదరాబాదీ బిర్యానీని రుచి చూడాలనుకున్నాడు. అయితే, రెండు మూడు ముద్దలు తినగానే క్లాసెన్ కి అసలు సినిమా కనిపించింది. ఆ బిర్యానీలోని మసాలాలు, కారం తట్టుకోలేక అతడు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్లలో నీళ్లు తిరగడం, ముఖమంతా చెమటలు పట్టడంతో ఏం చేయాలో అర్థం కాక కర్చీఫ్ తో తుడుచుకుంటూ కనిపించాడు.

ఈ సరదా దృశ్యాన్ని ఎస్ఆర్‌హెచ్ యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “అతడు కష్టపడే ఏకైక సమయం ఇదే” (The only time he struggles) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. క్లాసెన్ పక్కనే కూర్చున్న ఇషాన్ కిషన్, అతని రియాక్షన్ చూసి పగలబడి నవ్వడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. గ్రౌండ్ లో బౌలర్లను ఉతికి ఆరేసే క్లాసెన్, బిర్యానీ కారానికి ఇలా విలవిలలాడటం చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. “హైదరాబాద్ బిర్యానీ అంటే ఆ మాత్రం ఘాటు ఉండాల్సిందే బాసూ” అని కొందరు అంటుంటే, “క్లాసెన్ భయ్యా.. ఇది మైదానంలో బౌలర్లని కొట్టినంత ఈజీ కాదు” అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు. మొత్తానికి ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు మైదానం బయట కూడా ఇలా చిల్ అవుతూ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!