AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చాలామంది డైట్‌లో చికెన్‌ను భాగం చేసుకుంటారు. అయితే, చికెన్ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కొన్ని భాగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భాగాలను తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే అనారోగ్యానికి కారణమవుతాయని, ఈ భాగంలో పరాన్నజీవులు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున, ఆ భాగాన్ని నివారించడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ఆయా పార్ట్స్‌ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!
Chicken Parts To Avoid
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2026 | 10:59 AM

Share

చికెన్ ప్రియులు ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లోని కొన్ని భాగాలను తినకుండా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ మొత్తం ప్రోటీన్ సోర్స్ అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట భాగాలు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని తెలిస్తే షాక్‌ అవుతారు.. నివారించాల్సిన 4 చికెన్ భాగాలేంటంటే..

1. చికెన్ చర్మం (Chicken Skin):

చాలామంది చికెన్‌ను స్కిన్‌తో సహా వండుకుంటారు. కానీ, చికెన్ స్కిన్‌లో కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులకు, స్థూలకాయానికి దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే స్కిన్ లేని (Skinless) చికెన్ తినడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

2. చికెన్ మెడ (Chicken Neck):

కోడి మెడ భాగంలో లింఫ్ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులలో బ్యాక్టీరియా, డిటాక్సిన్ వంటి విషపదార్థాలు నిల్వ ఉండే అవకాశం ఉంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

3. ఊపిరితిత్తులు (Lungs):

చికెన్ ఊపిరితిత్తులలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినా కొన్ని రకాల మొండి బ్యాక్టీరియాలు చనిపోవు. ఇవి తిన్నప్పుడు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.

4. తోక భాగం (Tail):

చికెన్ తోక భాగంలో గ్రంథులు, మల విసర్జన నాళాలకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడ పరాన్నజీవులు (Parasites) బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.

చికెన్ తిన్నప్పుడు ప్రధానంగా బ్రెస్ట్ (Breast) లేదా లెగ్ (Leg) పీస్ వంటి కండ కలిగిన భాగాలను ఎంచుకోవడం మంచిది. అలాగే చికెన్‌ను శుభ్రంగా కడగడం, సరిగ్గా ఉడికించడం వల్ల బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రుచి కంటే ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి, ఈ నాలుగు భాగాలకు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us