AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Song Controversy : అర్థం తెలియదని సాకులు చెప్పడం సరికాదు.. మంగ్లీ పాడిన పాటపై కాంట్రావర్సీపై మహిళా కమిషన్ సీరియస్..

కన్నడ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో రాబోతున్న లేటేస్ట్ మూవీ ‘కేడీ: ది డెవిల్‌’ . ఈ సినిమాలో కన్నడ నటుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు హాజరుకావాలంటూ నోరా ఫతేహి, సంజయ్‌దత్‌లకు జాతీయ మహిళా కమిషన్ ఇటీవల సమన్లు జారీ చేసింది.

Song Controversy : అర్థం తెలియదని సాకులు చెప్పడం సరికాదు.. మంగ్లీ పాడిన పాటపై కాంట్రావర్సీపై మహిళా కమిషన్ సీరియస్..
Sarke Chunar Teri Sarke song
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2026 | 10:21 AM

Share

బాలీవుడ్ స్టార్ నటి నోరా ఫతేహి, సీనియర్ నటుడు సంజయ్ దత్ సర్కే చునార్ తేరీ సర్కే పాట విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. కన్నడ నటుడు ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil). ఈ చిత్రంలోని “సర్కే చునార్ తేరీ సర్కే” అనే ప్రత్యేక పాటను సింగర్ మంగ్లీ పాడగా.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, సంజయ్ దత్ కలిసి నటించారు. ఇటీవల విడుదలైన ఈ పాటలో అశ్లీలత, అసభ్యత ఉందన్న ఆరోపణల వచ్చాయి. చిత్రయూనిట్, డైరెక్టర్, నటీనటులపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ పాటై వచ్చిన ఆరోపణలపై పై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు నటీనటులతో పాటు చిత్ర దర్శకుడు, నిర్మాతలకు కూడా సమన్లు జారీ చేసింది.

ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

ఈ పాటలోని సాహిత్యం , విజువల్స్ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, లైంగికంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ సాహిత్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై సుమోటోగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్, ఈ పాట భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం పోక్సో (POCSO) చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది. అయితే ఈ విషయంపై ఏప్రిల్ 6న జరిగిన విచారణకు నోరా ఫతేహి తరపు లాయర్ హాజరుకావడంపై మహిళా కమిషన్ మండిపడింది. నోరా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇందుకు ఏప్రిల్ 27 వరకు సమయం ఇచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..

మరోవైపు ఏప్రిల్ 8న సంజయ్ దత్ విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఈ పాట వివాదం నేపథ్యంలో రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ, నిర్మాతలు ఇప్పటికే కమిషన్ కు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. పాటను ఇప్పిటకే యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ పాపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహాత్కర్ మాట్లాడుతూ.. పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉండడమే కాకుండా.. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉంది. పాట లిరిక్స్ అర్థం తెలియదని సాకులు చెప్పడం సరికాదని ఆమె అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్