మహేశ్- సుకుమార్ చిత్రంపై షాకింగ్ న్యూస్

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లో నటిస్తోన్న మహేశ్.. ఈ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్.. పూర్తి స్క్రిప్ట్‌ విన్నాకే సినిమాను చేద్దామని సుకుమార్‌తో చెప్పాడట. ఇందుకోసం లెక్కల మాష్టరుకు టైం కూడా ఇచ్చాడట. అయితే ఇంకా స్క్రిప్ట్ పూర్తి అవ్వలేదని ఇటీవల సుకుమార్ చెప్పడంతో మహేశ్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వినకుండా దర్శకులపై […]

మహేశ్- సుకుమార్ చిత్రంపై షాకింగ్ న్యూస్
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లో నటిస్తోన్న మహేశ్.. ఈ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్.. పూర్తి స్క్రిప్ట్‌ విన్నాకే సినిమాను చేద్దామని సుకుమార్‌తో చెప్పాడట. ఇందుకోసం లెక్కల మాష్టరుకు టైం కూడా ఇచ్చాడట. అయితే ఇంకా స్క్రిప్ట్ పూర్తి అవ్వలేదని ఇటీవల సుకుమార్ చెప్పడంతో మహేశ్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
స్క్రిప్ట్ వినకుండా దర్శకులపై నమ్మకం ఉంచిన మహేశ్ గతంలో కొన్ని పరాజయాలను మూటగట్టుకున్నాడు. దీంతో ఈ తప్పు భవిష్యత్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాడు. అంతేకాదు గతంతో సుకుమార్- మహేశ్ కాంబోలో వచ్చిన ‘నేనొక్కడినే’ పరాజయం అవ్వగా..  అదే ఫలితం ఈ సారి రిపీట్ అవ్వకూడదని మహేశ్ భావిస్తున్నాడట. అందుకే బౌండ్ స్క్రిప్ట్ పూర్తి అయితేనే సెట్స్ మీదకు వెళదామని మహేశ్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను మహేశ్ హోల్డ్‌లో పెట్టినట్లు టాక్. మరోవైపు నిర్మాతగా ప్రస్తుతం బిజీగా ఉన్న సుకుమార్.. ఈ స్క్రిప్ట్ పూర్తి చేసేందుకు ఆరు నెలలు పడుతుందని మహేశ్‌తో చెప్పినట్లు టాక్. దీంతో ఈ సినిమా ఆలస్యమవ్వనుందని సమాచారం.

Published On - 7:38 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu