బిగ్ బాస్ ఒవియా కావాలి

తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్ లో సంచలనంగా ఒవియా నిలిచింది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఒవియాకు మద్దతుగా నిలిచారు. ఒక సాదారణ సెలబ్రెటీగా హౌస్ లోకి వెళ్లిన ఒవియా స్టార్ స్టేటస్ తో బయటకు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత ఒవియా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆమె పొందిన అభిమానం అంతా ఇంతా కాదు. ఆమెను బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె అభిమానులు తలైవి(దేవత) అంటూ అభిమానిస్తూ వస్తున్నారు. ఆమె […]

బిగ్ బాస్ ఒవియా కావాలి
తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్ లో సంచలనంగా ఒవియా నిలిచింది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఒవియాకు మద్దతుగా నిలిచారు. ఒక సాదారణ సెలబ్రెటీగా హౌస్ లోకి వెళ్లిన ఒవియా స్టార్ స్టేటస్ తో బయటకు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత ఒవియా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆమె పొందిన అభిమానం అంతా ఇంతా కాదు. ఆమెను బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె అభిమానులు తలైవి(దేవత) అంటూ అభిమానిస్తూ వస్తున్నారు. ఆమె బిహేవియర్ మరియు మాట తీరుకు అంతా ఫిదా అయ్యారు.
తనను అంతలా అభిమానిస్తున్న ఫ్యాన్స్ కు ’90 ఎంఎల్’ చిత్రంతో ఒవియా షాక్ ఇచ్చింది. పచ్చి బోల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా అడల్డ్ సినిమా గా ఈ చిత్రం రూపొందినట్లుగా ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది. ఒవియా నుండి ఇలాంటి సినిమాను ఆమె అభిమానులు ఊహించలేదు. ఒవియా మరీ ఇలాంటి పాత్రను చేయడం ఏంటీ – స్కిన్ షోతో పాటు – ఇలా ముద్దు సీన్స్ ఏంటీ అంటూ ఆమెను అరాధిస్తున్న అభిమానులు అవాక్కవుతున్నారు.
ఒవియా సింప్లిసిటీ మరియు ఆమె ప్రవర్తనకు అభిమానులు అయిన వారంతా కూడా 90 ఎంఎల్ ట్రైలర్ చూసిన తర్వాత కాస్త స్వరం మారుస్తున్నారు. నిన్ను ఇలా చూడొద్దని అనుకున్నాం – కాని నువ్వు మాత్రం మాకు ఇలాంటి సినిమానే తీసుకు వచ్చావా అంటూ ఆగ్రహంగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ఒవియాలోని మార్పుపై పెద్ద చర్చకు తెర లేపారు. అయితే ఇప్పటి వరకు ఒవియా ఈ విషయమై స్పందించలేదు. హీరోయిన్ అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు చేయాలి. ఒవియా చేసిందాంట్లో తప్పేముందని కొందరు అంటున్నారు.

Published On - 7:30 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu