నిజంగా సూపర్ స్టారే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం చాలా ప్రాముఖ్యత ఇస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు మరియు భార్యతో మహేష్ బాబు చాలా సరదాగా గడిపే సందర్బాలు మరియు లవ్ చూపించే సందర్బాలు సోషల్ మీడియాలో చాలా చూస్తూనే ఉంటాం. మహేష్ బాబు నమ్రతల 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్బంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో రొమాంటిక్ పిక్చర్ ను పోస్ట్ చేశాడు. ఫొటోలో ఎలాంటి […]

నిజంగా సూపర్ స్టారే...!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం చాలా ప్రాముఖ్యత ఇస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు మరియు భార్యతో మహేష్ బాబు చాలా సరదాగా గడిపే సందర్బాలు మరియు లవ్ చూపించే సందర్బాలు సోషల్ మీడియాలో చాలా చూస్తూనే ఉంటాం. మహేష్ బాబు నమ్రతల 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్బంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో రొమాంటిక్ పిక్చర్ ను పోస్ట్ చేశాడు. ఫొటోలో ఎలాంటి కల్మషం లేకుండా మహేష్ మరియు నమ్రతలు నవ్వుతున్నారు. హ్యాపీ అనివర్శిరీ మై లవ్ అంటూ నమ్రతను ఉద్దేశించి మహేష్ పోస్ట్ చేశాడు.

ఇక తమ పెళ్లి రోజు సందర్బంగా గత ఏడాది హైదరాబాద్ లోని దేవ్ నగర్ అంధ పిల్లల స్కూల్ లో 600 మందికి భోజనం పెట్టించాడు. అదే విధంగా ఈ ఏడాది కూడా దేవ్ నగర్ అంధ పిల్లల స్కూల్ విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయించారు. ఈ ఏడాది 650 మంది పిల్లలకు మహేష్ దంపతులు కడుపు నింపారు. స్టార్ కపుల్స్ చేసిన పని ఇతరులకు ఆదర్శం అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యారేజ్ డే అంటే పార్టీలు ఇచ్చుకోకుండా ఇలా అంధ పిల్లలకు కడుపు నింపడం మంచి పని అంటూ అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

దేవ్ నగర్ అంధ పిల్లలకు మహేష్ దంపతులు ఏర్పాటు చేసిన లంచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో మహేష్ బాబు నిజంగా సూపర్ స్టార్ అంటూ అభిమానులు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు.

Published On - 7:20 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu