సంబంధాలు చూస్తున్నా: నిహారిక పెళ్లిపై నాగబాబు

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిహారికకు సంబంధాలు చూస్తున్నానని.. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లి చేస్తానని ఆమె తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక కెరీర్, వివాహంపై నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా తనకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చారు నాగబాబు. ‘‘ఏ రంగమైనా సరే. కులం, మతంతో పట్టింపు లేదు. మంచి గుణాలు, పద్ధతి గల కుర్రాడు చాలు. కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి’’ […]

సంబంధాలు చూస్తున్నా: నిహారిక పెళ్లిపై నాగబాబు
మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నిహారికకు సంబంధాలు చూస్తున్నానని.. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లి చేస్తానని ఆమె తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక కెరీర్, వివాహంపై నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా తనకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చారు నాగబాబు. ‘‘ఏ రంగమైనా సరే. కులం, మతంతో పట్టింపు లేదు. మంచి గుణాలు, పద్ధతి గల కుర్రాడు చాలు. కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి’’ అంటూ నాగబాబు తెలిపాడు.
ఇక సినిమాల్లోనూ రావాలనుకుంటున్న సమయంలో నిహారిక తన దగ్గరకు వచ్చి.. ‘‘నేను నటిస్తా నాన్నా. మంచి కథలనే ఎంచుకుంటా. ఇంట్లో అందరూ నటులు ఉంటే నటించాలని నాకు ఎందుకు ఉండదు’’ అని చెప్పి కన్విన్స్ చేసిందని నాగబాబు చెప్పారు. అలాగే సినిమాల్లోకి వచ్చే ముందే పెళ్లి గురించి నిహారికకు సమయం ఇచ్చానని.. ఇప్పుడు ఆ టైం ముగిసింది కాబట్టే తనకు పెళ్లి చేయాలనుకుంటున్నానని అతడు పేర్కొన్నారు. కాగా నిహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ అనే చిత్రంలో నటిస్తోంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా’లోనూ నిహారిక ఓ పాత్రలో మెరవనుంది.

Published On - 5:43 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu