నెటిజన్ కు మనోజ్ ఫన్నీ కౌంటర్

మంచు లక్ష్మికి సంబంధించిన ఎన్నో ఫన్నీ కామెంట్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు లక్ష్మి ఇంగ్లీష్ మాట్లాడే తీరు అంటూ ఎంతో మంది కామెడీలు చేశారు చేస్తూనే ఉన్నారు. ఇక మోహన్ బాబు ఆమద్య ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫసక్ అనే పదం వాడారు. ఆ పదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఫసక్ అనే పదం పై లక్షల కొద్ది మీమ్స్ సోషల్ […]

నెటిజన్ కు మనోజ్ ఫన్నీ కౌంటర్
మంచు లక్ష్మికి సంబంధించిన ఎన్నో ఫన్నీ కామెంట్స్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు లక్ష్మి ఇంగ్లీష్ మాట్లాడే తీరు అంటూ ఎంతో మంది కామెడీలు చేశారు చేస్తూనే ఉన్నారు. ఇక మోహన్ బాబు ఆమద్య ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫసక్ అనే పదం వాడారు. ఆ పదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఫసక్ అనే పదం పై లక్షల కొద్ది మీమ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. సినిమాల్లో సీరియల్స్ లో కామెడీ కోసం ఫసక్ వాడేస్తున్నారు. తమను ఇంతగా ట్రోల్ చేస్తున్నా తమ కామెంట్స్ కు మీమ్స్ పడుతున్నా కూడా మంచు ఫ్యామిలీ మాత్రం స్ఫోర్టివ్ గా తీసుకుంటూ అభినందనలు అందుకుంటుంది.
మంచు లక్ష్మి ఒకానొక సందర్బంలో మాట్లాడుతూ ఐయామ్ నిలదీస్ఫైయింగ్ అంటూ కొత్త వ్యాఖ్య చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. అయితే వాటిని కూడా మంచు ఫ్యామిలీ సరదాగానే తీసుకుంది. తాజాగా మరోసారి ఆ పదాన్ని మంచు మనోజ్ వాడటం జరిగింది. ‘ఫసక్’ పదంతో ఒక సినిమానే తీసేందుకు మంచు విష్ణు సిద్దం అయ్యాడు. తాజాగా మంచు మనోజ్ మోడీకి వ్యతిరేకంగా పెట్టిన ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి మంచు మనోజ్ పై ట్వీట్ చేశాడు. కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లను చంద్రబాబు ఎలా ఖర్చు చేశారో ప్రశ్నించండి క్యాస్టియెస్ట్ ఇడియట్ అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు మనోజ్ కూడా సీరియస్ అయ్యాడు. పేరు వెనుక రెడ్డి క్యాస్ట్ పెట్టుకున్నది నువ్వా నేనా.. మరి క్యాస్టియోస్ట్ ఇడియట్ ఎవరు ఐయామ్ నిలదీస్ఫైయింగ్ అంటూ సీరియస్ ట్వీట్ లో సరదాగా ఈ పదం వాడాడు. మనోజ్ సమయస్ఫూర్తికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Published On - 8:08 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu