Biggboss 5 Telugu: ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ విన్నర్‌గా ఎవరెవరు నిలిచారు.. ఇప్పుడు వారేం చేస్తున్నారు.?

Biggboss 5 Telugu: ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ విన్నర్‌గా ఎవరెవరు నిలిచారు.. ఇప్పుడు వారేం చేస్తున్నారు.?
Biggboss Winners

Biggboss 5 Telugu Winners: వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ హాలీవుడ్‌లో మొదలై టాలీవుడ్‌ వరకు చేరుకుంది. మొదట భారత్‌లో హిందీలో ప్రారంభమైన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఆ తర్వాత..

Narender Vaitla

|

Dec 19, 2021 | 11:55 PM

Biggboss 5 Telugu Winners: వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ హాలీవుడ్‌లో మొదలై టాలీవుడ్‌ వరకు చేరుకుంది. మొదట భారత్‌లో హిందీలో ప్రారంభమైన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఆ తర్వాత కన్నడతో పాటు తమిళ్‌, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోకి వచ్చేసింది. ప్రసారమైన అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంటూ టీఆర్‌పీ రేటింగ్స్‌ బద్దలు కొట్టిందీ షో. అప్పటి వరకు ఉన్న రియాలిటీషోలకు సరికొత్త అర్థం చెబుతూ వచ్చిన బిగ్‌బాస్‌ బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగులో 5 సీజన్‌లు విజయంతంగా పూర్తయ్యాయి. 5వ సీజన్‌లో సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎపిసోడ్‌ మొదట్లో సాధారణ వ్యక్తిలా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ అనంతరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ చివరికి టైటిల్‌ను కొట్టేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రసారమైన మొత్తం బిగ్‌బాస్‌లలో ఎవరు విజయాన్ని సాధించారు. వారు గెలుచుకున్న ప్రైజ్‌ మనీ ఎంత, ప్రస్తుతం ఆ విన్నర్స్‌ ఏం చేస్తున్నారు లాంటి ఆసక్తికర విషయాలు..

మొదటి సీజన్‌..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్‌ మొదటి ఎపిసోడ్‌ 2017లో జరిగింది. ఇక తొలి ఎపిసోడ్‌ ఫైనల్‌ 2017 డిసెంబర్‌ 24న జరిగింది. ఇందులో టాలీవుడ్‌ యాక్టర్‌ శివ బాలాజీ టైటిల్‌ను గెలుచుకొని తెలుగు బిగ్‌బాస్‌ తొలి విన్నర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇక రన్నర్‌ అప్‌గా ఆదర్శ్‌ బాలకృష్ణ నిలిచారు. విన్నర్‌గా గెలిచిన శివ బాలాజీ రూ. 50 లక్షలను సొంతం చేసుకున్నాడు. శివ బాలాజీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.

సెకండ్‌ సీజన్‌ విన్నర్‌.. కౌషల్‌..

నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు రెండవ సీజన్‌లో కౌషల్‌ విన్నర్‌గా నిలిచాడు. 2018 సెప్టెంబర్‌ 30న జరిగిన ఈ ఫైనల్‌లో కౌషల్‌ రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. అలాగే రన్నర్‌ అప్‌గా గీతా మాధురి నిలిచారు. టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ను మొదలు పెట్టిన కౌషల్‌ తనదైన శైలిలో రాణించి బిగ్‌బాస్‌ హౌస్‌ బయట ఒక ఆర్మీనే సంపాదించుకున్నాడు. ఓవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు కౌషల్‌ వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టాడు. ఇక 2019లో కౌషల్‌ బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

మూడవ సీజన్‌లో రాహుల్‌..

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు మూడవ సీజన్‌లో ర్యాప్‌ సింగ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌గా నిలిచాడు. 2019 నవంబర్‌ 3న జరిగిన ఈ ఫైనల్‌లో టైటిల్‌తో పాటు రూ. 50 లక్షల మనీని గెలుచుకున్నాడు. ఇక శ్రీముఖి ఈ సీజన్‌లో రన్నర్‌ అప్‌గా నిలిచారు. రాహుల్‌ ఇప్పటి వరకు తెలుగులో 50 పాటలకుపైగా పాడాడు. రాహుల్‌ తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో 4 పాటలు పాడి తన సత్తా చాటుకున్నాడు.

నాల్గవ సీజన్‌ విన్నర్‌గా అబిజిత్‌..

నాగార్జున వరుసగా రెండో సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు 4వ సీజన్‌లో నటుడు అబిజిత్‌ విన్నర్‌గా నిలిచాడు. 2020 డిసెంబర్‌ 20న జరిగిన గ్రాండ్‌ ఫైనల్‌లో టైటిల్‌ విన్నర్‌గా గెలిచాడు అబిజిత్‌. ఇక ఈ సీజన్‌లో అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌ అప్‌గా నిలిచాడు. ఇక అబిజిత్‌ కెరీర్‌ విషయానికొస్తే 2012లో వచ్చిన లైప్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అబిజిత్‌ పెళ్లి గోలా వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు.

Also Read: Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలా? అయితే, ప్రతీ రోజూ ఈ పప్పు దినుసులను తినాల్సిందే..!

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న వారికి ఆ ఇబ్బంది తప్పనిసరి అంటున్న శాస్త్రవేత్తలు..

Migraine: మైగ్రేన్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారా? మందులు పనిచేయడం లేదా? ఇలా చేయండి చాలు అంటున్నారు నిపుణులు!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu