Bigg Boss Telugu 5 Winner: గ్రాండ్‌ సండే సన్నీదే.. బిగ్‌బాస్‌ 5 విజేతగా నిలిచిన వీజే సన్నీ..

Biggboss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విజేతగా వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో...

Bigg Boss Telugu 5 Winner: గ్రాండ్‌ సండే సన్నీదే.. బిగ్‌బాస్‌ 5 విజేతగా నిలిచిన వీజే సన్నీ..
Biggboss 5 Winner Sunny
Narender Vaitla

|

Dec 19, 2021 | 11:20 PM

Bigg Boss Telugu 5 Winner: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విజేతగా వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ను ఎగిరేసుకుపోయాడు. ఇక రన్నర్‌ అప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలవగా, సెకండ్‌ రన్నర్‌ అప్‌గా శ్రీరామ చంద్ర నిలిచాడు.

బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్న సన్నీకి అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు హంగామా చేస్తున్నారు. రాత్రి మొత్తం సంబరాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో సన్నీ అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు రానున్నాడు. విజేతగా నిలిచిన సన్నీని ర్యాలీగా తీసుకెళ్లడానికి ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉన్నారు. అనంతరం మాధాపూర్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో సన్నీ పాల్గొననున్నాడు.

బిగ్‌బాస్‌ 5 సీజన్‌ సాగిందిలా..

బోర్‌డమ్‌కు చెప్పండి గుడ్‌బై – వచ్చేస్తోంది బిగ్‌బాస్. ఇదీ, బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభానికి ముందు టీజర్. బోర్‌డమ్‌కి గుడ్‌బై ఏమో కానీ… బోలెడన్నీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అయ్యింది బిగ్‌బాస్ సీజన్-5. అసలు, బిగ్‌బాస్‌ షోనే బ్యాన్‌ చేయాలనేవరకు సీన్ వెళ్లింది. బిగ్‌బాస్ సీజన్‌-5 రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చీకట్లో హగ్‌లు, బాత్రూమ్‌ సీన్స్, లవ్‌ ట్రాక్‌లు, బూతు పురాణం, ఆడామగ దుప్పట్లో దూరడాలు, ఏడుపులు-అరుపులు, గొడవలు-కొట్లాటలు, కోపాలు-అలకలు… ఇలా చెప్పుకుంటేపోతే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే. డ్రామా బాగానే పండించిన హౌస్ మేట్స్… టాస్కుల్లోనూ కావాల్సినంత రచ్చ చేస్తూ అట్రాక్ట్ చేశారు. సెప్టెంబర్ 5న 19మందితో మొదలైన సీజన్‌-5 ఫస్ట్ వీక్‌ నుంచే కాక పుట్టించింది. మొదటి వారం నామినేషన్స్‌ ప్రక్రియే హౌస్‌లో చిచ్చురేపింది. హౌస్ మేట్స్ ఆవేశంతో ఊగిపోయారు. బూతులతో చెలరేగిపోయారు. నక్కలు, తోడేళ్లు అంటూ ఒకర్నొకరు ఆడేసుకున్నారు. అప్పటికి వచ్చి వారమైనా కాలేదు… కానీ కంటెస్టెంట్స్‌ మాత్రం కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు.

థర్డ్‌ వీక్‌లో అసలు సీన్‌..

అసలు సిసలు సీన్‌ థర్డ్‌ వీక్‌లో జరిగింది. థర్డ్‌ వీక్‌లో బాత్రూమ్‌ సీన్ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. లహరిని నామినేట్ చేస్తూ ప్రియ చేసిన కామెంట్స్ బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కాదు… బయట కూడా రచ్చరచ్చ చేశాయి. ఆ సీన్‌తో సీపీఐ నారాయణ లాంటివాళ్లు మొత్తం బిగ్‌బాస్‌ షోనే బ్యాన్‌ చేయాలనే డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ సీజన్5 ఎలిమినేషన్స్‌లో ట్విస్టులకేమీ కొదవలేదు. ఎలిమినేట్ అవుతారనుకున్నోళ్లు హౌస్‌లో…. ఉంటారనుకున్నోళ్లు బయటికి రావడంలాంటి సీన్స్‌ రచ్చ చేశాయి. మెయిన్‌గా యాంకర్‌ రవి ఎలిమినేషన్‌ కాక పుట్టించింది. ఊహించనివిధంగా రవి ఎలిమినేట్‌ కావడంతో అతని ఫ్యాన్స్‌ రచ్చరచ్చ చేశారు. పొలిటికల్‌ టర్న్‌ కూడా తిరిగిందంటే రవి ఎలిమినేషన్ ఏ రేంజ్‌లో రచ్చయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. కంటెస్టెంట్స్‌ గేమ్‌ ప్లాన్‌ ఎవరూ ఊహించని విధంగా సాగింది. ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఆట ఆడారు. టాప్ కంటెస్టెంట్స్ అనుకున్నోళ్లు మధ్యలోనే వెళ్లిపోతే… ఒకట్రెండు వారాల కంటే ఎక్కువ సీన్‌ లేదనుకున్నోళ్లు టాప్‌ 10వరకు, ఆ తర్వాత టాప్ 7కి, టాప్ సిక్స్‌ వరకు జర్నీ సాగింది.

ఎలిమినేషన్‌ ఇలా సాగింది..

ఇక, ఫస్ట్‌ వీక్‌ నుంచి ఫోర్టీన్త్‌ వీక్‌ వరకు జరిగిన ఎలిమినేషన్స్‌ చూస్తే… మొదటి వారం సరయు… సెకండ్ వీక్ ఉమాదేవి… థర్డ్ వీక్ లహరి ఎలిమినేట్‌ అయ్యారు. ఆ తర్వాత వరుసగా నటరాజ్‌ మాస్టర్, హమీద, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంక ఎలిమినేట్ కాగా… ఫోర్టీన్త్ వీక్‌లో కాజల్ హౌస్ నుంచి బయటికొచ్చింది. టాప్‌5లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్, సిరి నిలిస్తే… లాస్ట్‌ వీక్‌లోనూ బిగ్‌ బాస్ ఓ ట్విస్ట్‌ ఇచ్చి టెన్షన్ పుట్టించాడు. గ్రాండ్‌ ఫినాలేకి సరిగ్గా రెండ్రోజుల ముందు అనూహ్యంగా సిరిని హౌస్‌ నుంచి బయటికి పంపి హౌస్ మేట్స్‌లో కలకరం రేపాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu