Anushka Sharma: మీడియాకు ధన్యవాదాలు తెలిపిన అనుష్క శర్మ.. కారణమేంటో తెలుసా.?
Anushka Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల ముద్దురు కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనికి కారణం.. విరుష్క జంట ఇప్పటి వరకు..
Anushka Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల ముద్దురు కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనికి కారణం.. విరుష్క జంట ఇప్పటి వరకు తమ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. వామికాను ప్రపంచానికి కనిపించకుండా అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారీ కపుల్. సోషల్ మీడియాలో చిన్నారిని ముద్దు చేస్తున్నట్లున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నా అందులో వామికా మాత్రం కనిపించడంలేదు. తమ చిన్నారి ప్రైవసీకి పెద్ద పీట వేయడానికే తాము అలా చేస్తున్నట్లు ఇప్పటికే చాలా సార్లు ఈ కపుల్ మీడియాకు చెబుతూ వస్తున్నారు. అంతటితో ఆగకుండా మీడియాను కూడా వామికా ఫోటోలు తీయకండని రెక్వెస్ట్ చేస్తూ వస్తోందీ జంట.
విరుష్క జంట విజ్ఞప్తికి అనుగుణంగానే మీడియా కూడా ఇప్పటి వరకు వామికాకు సంబంధించి ఒక్క ఫోటోను కూడా పబ్లిష్ చేయలేదనే చెప్పాలి. అయితే ఇటీవల అనుష్క, కోహ్లీలు తమ చిన్నారితో బయటకు రాగా మీడియా వాళ్లు ఫోటోలు తీశారని వార్తల ఉవచ్చాయి. దీంతో ఈ విషయమై అనుష్క ఫోటోలను పోస్ట్ చేయకండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. దీంతో మీడియా కూడా వామికా ఫోటోలను ఎక్కడ పబ్లిష్ చేయలేదు. దీంతో తాజాగా అనుష్క శర్మ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ పోస్ట్ చేస్తూ… వామికా ఫోటోలు/వీడియోలను పోస్ట్ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమ చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నామని తెలిపి అనుష్క, అందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని రాసుకొచ్చారు.
Also Read: Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..
Health Benefits: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులతో ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!