రోజాపై ఆది అసభ్యకర వ్యాఖ్యలు: షాక్‌లో నెటిజన్లు

జబర్దస్త్‌లో.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుబుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అయితే.. గురువారం ప్రసారమైన జబర్దదస్త్‌లో.. ఆది.. జడ్జి హోదాలో ఉన్న రోజాపై ఆసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్కిట్‌లో భాగంగా.. వరుణ్ తేజ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. గద్దల కొండ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అతని […]

రోజాపై ఆది అసభ్యకర వ్యాఖ్యలు: షాక్‌లో నెటిజన్లు

జబర్దస్త్‌లో.. హైపర్ ఆదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక పంచ్‌ నుంచి తేరుకునేలోపే.. మరో పంచ్‌ వేసి కడుబుబ్బా నవ్విస్తాడు. అంతేకాకుండా.. అప్పుడుప్పుడు స్కిట్‌లో భాగంగా.. జడ్జిలపై, యాంకర్లపై కూడా పంచ్‌లు వేస్తూంటాడు. అయితే.. గురువారం ప్రసారమైన జబర్దదస్త్‌లో.. ఆది.. జడ్జి హోదాలో ఉన్న రోజాపై ఆసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

స్కిట్‌లో భాగంగా.. వరుణ్ తేజ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. గద్దల కొండ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అతని భార్యగా.. సీరియల్ యాక్టర్ రోహిణీ, మరదలిగా శాంతి స్వరూప్ చేశారు. ఈలోపు శాంతిస్వరూప్.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గనక నన్ను చూసి ఉంటే.. ఖచ్చితంగా.. పండులతో కొట్టేవాడని అన్నాడు. దానికి ఆది.. పండులతో.. పావులతో కొట్టడానికి నువ్వేమన్నా రోజా గారివా అని అన్నాడు. దీంతో.. ఇది విన్న రోజా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈలోపు ఆది.. ఆవిడంటే.. అందెగత్త కాబట్టి అలా కొడతారు.. నువ్వేంటి..? అంటూ తన స్కిట్‌ను కొనసాగించాడు. ఇది స్కిట్‌లో భాగమైనా.. ఒక పొలిటికల్ లీడర్ కమ్ జడ్జి అయిన రోజాను.. ఇలా అనడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నోటి దురుసుతో.. గతంలో ఒకసారి వార్తల్లోకెక్కాడు.. ఆది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu