డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మకాల్లో ‘సైరా’ సంచలనం..భారీ ధరకు..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సైరా’ పీవర్ నడుస్తోంది. మెగాస్టార్ మేనియాతో థియేటర్లు ఊగిపోతున్నాయి. తొలితరం స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చాడు మెగా ప్రొడ్యుసర్ రామ్ చరణ్ తేజ్. సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి విడుదలైన […]

డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మకాల్లో 'సైరా' సంచలనం..భారీ ధరకు..?
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 1:18 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సైరా’ పీవర్ నడుస్తోంది. మెగాస్టార్ మేనియాతో థియేటర్లు ఊగిపోతున్నాయి. తొలితరం స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలన్న మెగాస్టార్ కోరికను తీర్చాడు మెగా ప్రొడ్యుసర్ రామ్ చరణ్ తేజ్. సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదల ప్రొడక్షన్స్‌లో రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.

బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టాడు మెగాస్టార్.

ఇక మరోవైపు డిజిటల్ మార్కెట్ విషయంలో కూడా సత్తా చాటుతోంది. శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నారు. తాము సైరా హక్కులను సొంతం చేసుకున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది జెమినీ ఛానల్. చాలా ఛానళ్లు పోటీ పడినప్పటికి..25 కోట్లు పెట్టేంత డేర్ ఎవ్వరూ చెయ్యలేదు. తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో సైరా హక్కులను జెమినీ ఛానల్ సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ. 50 కోట్లకు సొంతం చేసుకుంది.