‘హీరో’ టైటిల్‌పై యుద్ధం.. గెలిచేదెవరు?
విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్న చిత్రం ‘హీరో’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పోర్ట్స్ కథాంశంతో దక్షిణాది భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పరంగా ఓ చిక్కొచ్చి పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే, తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన కొత్త చిత్రం పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]
విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై తెరకెక్కిస్తున్న చిత్రం ‘హీరో’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పోర్ట్స్ కథాంశంతో దక్షిణాది భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పరంగా ఓ చిక్కొచ్చి పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే, తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన కొత్త చిత్రం పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు కూడా ‘హీరో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనితో ఈ ఇద్దరి హీరోల్లో ఒకరు తమ టైటిల్ ను ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల నిర్మాతలు ‘హీరో’ టైటిల్ సాక్షిగా గొడవ పడుతున్నారు.
విజయ్ దేవరకొండ ‘హీరో’ను తమిళంలో ట్రైబల్ ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. ఇక వారి వెర్షన్ ఏంటంటే.. 2017లోనే తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ‘హీరో’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నామని.. ఇక ప్రతి ఏడాది ఆ టైటిల్‌ను పునరుద్ధరిస్తూ వస్తున్నామని అన్నారు. అంతేకాక నిర్మాత మండలి.. ‘హీరో’ టైటిల్ తమకే చెందుతున్నట్లు ఇచ్చిన రాతపూర్వక లేఖను కూడా జత చేశారు. దీనికి అనుగుణంగా కెజెఆర్ స్టూడియోస్ అధినేత రాజేష్‌కు కూడా లీగల్ నోటీసు పంపించారు.
ఇది ఇలా ఉంటే నిర్మాత రాజేష్ ఈ టైటిల్ విషయంపై వెనక్కి తగ్గేలా కనిపించట్లేదని టాక్. ఈ సునిశితమైన సమస్యను కోర్టులోనే తేల్చుకోవడానికి సిద్దపడ్డాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కాగా, ‘హీరో’ టైటిల్ హక్కులను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.కుమారన్ దగ్గర నుంచి 2018లో దక్కించుకున్నట్లు చెబుతున్నారు.