‘సైరా’ కోసం బిగ్ బీ ఎందుకు రెమ్యునరేషన్ తీసుకోలేదంటే.?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా మూవీ ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులు నటించిన సంగతి తెలిసిందే. అందులోనూ బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. చిరంజీవికి […]

'సైరా' కోసం బిగ్ బీ ఎందుకు రెమ్యునరేషన్ తీసుకోలేదంటే.?
Ravi Kiran

|

Oct 05, 2019 | 5:35 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా మూవీ ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖ నటులు నటించిన సంగతి తెలిసిందే. అందులోనూ బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. చిరంజీవికి గురువు పాత్రలో నటించారు.  చిరంజీవి తర్వాత సినిమాలో కీలకమైన పాత్ర అమితాబ్‌ది. ఇక ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్‌ తీసుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాక ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో కూడా చిరంజీవి ఇదే విషయాన్ని మీడియా ముందు బహిర్గతం చేశాడు.

చిరంజీవికి, అమితాబ్‌కు ముందు నుంచి మంచి స్నేహబంధం ఉంది. అదీ కాకుండా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు సినిమా కావడంతో బిగ్ బీ ఆసక్తి చూపించారు. విలక్షణ పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే బిగ్ బీ.. మంచి పాత్రలను మాత్రం ఎన్నుకునేవారు తప్ప రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ‘సైరా’కు కూడా స్నేహితుడు చిరంజీవి కోసం పారితోషికం తీసుకోకుండా నటించారు. అంతేకాక తొలి స్వాతంత్ర్య సమరయోధుడు కథ ప్రేక్షకులకు చూపించడంలో తాను భాగం అవుతానని.. తన సొంత ఫ్లైట్‌లో షూటింగ్‌ వచ్చారని చిరంజీవి సక్సెస్ మీట్‌లో ఈ విషయం ప్రకటించాడు. ఏది ఏమైనా గొప్ప చారిత్రాత్మక చిత్రంలో ఇద్దరు మెగాస్టార్స్‌ను వెండితెరపై చూడడంతో ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu