పవన్ వెన్ను నొప్పికి నేచర్ క్యూర్ థెరపీ ! ఇస్తుందా రిలీఫ్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. తొలుత ‘ గబ్బర్ సింగ్ ‘ మూవీ షూటింగ్ సందర్భంగా ఆయనకు మొదలైన ఈ నొప్పి ఆయనను వదలడంలేదు. ఈ పెయిన్ ని పెద్దగా పట్టించుకోని ఈ హీరో-కమ్-పొలిటిషియన్.. కి మళ్ళీ అది ఏపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా తిరగబెట్టింది. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇవ్వడంతో కొన్ని వారాలు పవన్ అలాగే చేశాడు. ఆ మధ్య విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. తొలుత ‘ గబ్బర్ సింగ్ ‘ మూవీ షూటింగ్ సందర్భంగా ఆయనకు మొదలైన ఈ నొప్పి ఆయనను వదలడంలేదు. ఈ పెయిన్ ని పెద్దగా పట్టించుకోని ఈ హీరో-కమ్-పొలిటిషియన్.. కి మళ్ళీ అది ఏపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా తిరగబెట్టింది. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇవ్వడంతో కొన్ని వారాలు పవన్ అలాగే చేశాడు. ఆ మధ్య విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనలేకపోయాడు కూడా.. కాస్త తగ్గినట్టు అనిపించినప్పటికీ.. తిరిగి ఈ రుగ్మత బాధ పెట్టడంతో సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ.. దాన్ని కాదని పవన్ నేచర్ క్యూర్ థెరపీ పట్లే మొగ్గాడు.
అసలు వెన్ను నొప్పి చికిత్సకు ప్రకృతి మూలికా వైద్యం మంచిదేనా ? ఈ నొప్పి వివిధ రకాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో గంటలపాటు ఒకే పొజిషన్ లో ఉన్నా, లేదా ఎక్సర్ సైజ్ (వ్యాయామం) లేకున్నా.. ఒక్కోసారి మద్యం తాగే అలవాటు ఉన్నా ఇలాంటి రుగ్మత తప్పదని అంటున్నారు.అంతే కాదు.. న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, యోగాసనాలు వేయకపోవడం, ఆహారంలో క్యాల్షియం లేకపోవడం, అలాగే విటమిన్-డీ లోపం వంటివి ఇందుకు కారణాలట. డైట్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని, శరీర బరువును నియంత్రించుకోవాలని, హీల్ (ఎత్తు) తక్కువగా ఉన్న పాద రక్షలు ధరించాలని చెబుతున్నారు. దీనివల్ల వెన్నెముకపై భారం తగ్గుతుందన్నదివారి వాదన. అలాగే కోల్డ్ థెరపీ, హీట్ థెరపీ వంటివి కూడా తప్పనిసరి అని సూచిస్తున్నారు. . కోల్డ్ థెరపీ అంటే.. ఐస్ తో చుట్టిన బట్టను నొప్పి ఉన్న చోట ఉంచాలని, లేదా కోల్డ్ జెల్ ప్యాక్ తో అద్దడం సరైనదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చికిత్సల వల్ల కండరాలు వ్యాకోచించకుండా ఉంటాయని, హీట్ థెరపీలో గోరు వెచ్చ్చని నీటితో స్నానం చేయడం మంచిదని బెటర్ అంటున్నారు. హీటింగ్ ప్యాడ్ ని డాక్టర్ల సలహాతో వాడాలని సూచిస్తున్నారు.
ఇక పవన్ వంటి సినీ ఆర్టిస్టులు షూటింగుల సమయంలో బరువైన ఆయుధాలను మోయడం మంచిది కాదని, స్టంట్ సీన్స్ లో ఎమోషనల్ గా ఫీల్ కారాదని కొందరు మానసిక వైద్యులు కూడా చెబుతున్నారు. సినీ ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో బిజీబిజీగా గడిపాడు. అలాంటి సమయాల్లో శరీర కండరాలకు, మెదడుకు, మనస్సుకు కూడా విశ్రాంతి అవసరమే. తరచూ ఇవి కూడా బ్యాక్ ఏక్ కి కారణాలవుతున్నాయని విశ్లేషిస్తున్నారు. బిహేవియరల్ థెరపీ వల్ల కూడా వెన్నునొప్పి తగ్గుతుందని అంటున్నారు.
గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కనిపించని పవన్ కళ్యాణ్.. ఈ మధ్యే కేరళ వెళ్లాడని, అక్కడ తన వెన్నునొప్పికి మూలికా వైద్య చికిత్స పొందుతున్నాడని, యోగా కూడా చేస్తున్నాడని సమాచారం. ఇద్దరు స్పెషలిస్టులు ఆయనకు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా శరీర బరువు తగ్గడానికి, ఇతర రుగ్మతల చికిత్సకు ఆ రాష్ట్రానికి వెళ్లి కొన్ని రోజులపాటు ట్రీట్ మెంట్ పొంది వచ్చారు. కేరళ ప్రకృతి వైద్య చికిత్సలో ఉదయమే సూర్యసనాలు వేయడం, కొన్ని రకాల ఆకు పసర్లతో శరీర మర్దన చేయించుకోవడం వంటివి ఉంటాయి. ఇందుకోసం అలెప్పీ వంటి జిల్లాల్లో ప్రత్యేక ప్రకృతి వైద్య చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో కొన్ని రోజులపాటు చేసే వ్యాయామం, యోగా వంటివాటివల్ల ఇలాంటి వెన్నునొప్పి పూర్తిగా మటుమాయమవుతుందని అంటున్నారు. మరి-పవన్ కళ్యాణ్ సైతం తన రుగ్మతకు మంచి చికిత్స పొంది.. పూర్తిగా కోలుకుని తిరిగి వస్తాడని ఆశిద్దాం.