AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలుకోని పవన్.. ఆందోళనలో ఫ్యాన్స్

రాజకీయంగా జనసేనాని… ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్.. ఆయనే పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య విపరీతమైన వెన్నునొప్పి సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు ఆయన స్వయంగా చెప్పారు. తమ అభిమాన హీరోకు ఆరోగ్యం బాగాలేదని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.   అయితే అసలు ఆయన వెన్నునెప్పి ఎందుకు వచ్చిందో అనే విషయాన్నిగమనిస్తే.. పవన్ సెన్సేషన్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయంలో ఆయనకు వెన్నునొప్పి వచ్చింది. అప్పటినుంచి ఆయన […]

కోలుకోని పవన్.. ఆందోళనలో ఫ్యాన్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 6:02 PM

Share

రాజకీయంగా జనసేనాని… ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్.. ఆయనే పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య విపరీతమైన వెన్నునొప్పి సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు ఆయన స్వయంగా చెప్పారు. తమ అభిమాన హీరోకు ఆరోగ్యం బాగాలేదని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Jansena chief pawan kalyan health issue treatment is started

అయితే అసలు ఆయన వెన్నునెప్పి ఎందుకు వచ్చిందో అనే విషయాన్నిగమనిస్తే.. పవన్ సెన్సేషన్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయంలో ఆయనకు వెన్నునొప్పి వచ్చింది. అప్పటినుంచి ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయితే గబ్బర్‌సింగ్ తర్వాత కొన్ని సినిమాలు కూడా నొప్పితే బాధపడుతూనే పూర్తిచేశారు. ఈ లోపుగా ఎన్నికలు రావడంతో దానిలో భాగంగా పవన్ పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోయారు. అప్పటినుంచి నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. సుధీర్ఘం యాత్ర కూడా చేశారు. అప్పుడు కూడా తన ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్కచేయలేదు.

Jansena chief pawan kalyan health issue treatment is started

ప్రస్తుతం ఆయనకు వెన్నునొప్పి తీవ్రం కావడంతో చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తన అనారోగ్య పరిస్థితిని ఇటీవల ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అలుపెరగకుండా తిరిగిన పవన్ కళ్యాణ్‌ తీవ్ర ఇబ్బందిగా పరిణమించిన వెన్నునొప్పికి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే దాన్నికాదని కేవలం ప్రకృతి వైద్యం చేయించుకోడానికి ఆయన నిర్ణయించారు. ఇది చాలా కాలం పాటు చేయాల్సిన ఉన్నందున దానిపై పూర్తి క్లారిటీ లేదు. మరోవైపు రోజు రోజుకు ఇబ్బంది పెడుతున్న వెన్నునొప్పికి వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తే పవన్ ఎటూ కదలలేని పరిస్థితి ఎదురవుతుంది.

Jansena chief pawan kalyan health issue treatment is started

తమ అభిమాన నటుడు, జనసేనాని వెన్నునొప్పితో బాధపడుతుండటంపై కార్యకర్తలు, ఫ్యాన్స్ తీవ్రంగా కలత చెందుతున్నారు. నడుము నొప్పికి సర్జరీ చేయించుకుంటే ఏదైనా ప్రమాదం ఏర్పడుందేమో అని భయపడుతున్నారు. ఆయన ట్రీట్‌మెంట్‌కు ఎక్కవ రోజులు పట్టే అవకాశాలు ఉన్నందున పార్టీ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారో అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సూపర్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ అనారోగ్య సమస్య కూడా వారిని బాధకు గురిచేస్తుంది. ఏది ఏమైనా పవన్ మళ్లీ ఆరోగ్యంతో తమ ముందకు రావాలని వారంతా కోరుతున్నారు. పవన్ త్వరగా కోలుకుని .. మళ్లీ సినిమాలు చేయాలని, జనసేనానిగా తమ సమస్యలపై పోరాడాలని కోరుకుంటున్నారు.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు