AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Godfather: ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదరే.. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ మూవీ

1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ది గాడ్‌ఫాదర్. ఈ మూవీకి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా దర్శకత్వం వహించారు.

The Godfather: ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదరే.. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ మూవీ
The Godfather
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2022 | 5:14 PM

Share

The Godfather: 1969లో మారియో పుజో రచించిన ది గాడ్‌ఫాదర్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ది గాడ్‌ఫాదర్. ఈ మూవీకి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా(Francis Ford Coppola) దర్శకత్వం వహించారు.. 1972లో వచ్చిన ది గాడ్‌ఫాదర్ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక మరెన్నో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్  టాప్ 10 చిత్రాలు జాబితాలో గ్యాంగ్‌స్టర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మార్చి 14 2022 తో ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ది గాడ్‌ఫాదర్ సినిమా కొత్త చరిత్రను సృష్టించడమే కాదు ఎన్ని సినిమాలకు స్పూర్తినిచ్చింది. ఇప్పటికీ చాలా సినిమాల్లో గాడ్ ఫాదర్ మూవీ రిఫరెన్స్ లు కనిపిస్తూ ఉంటాయి. సీన్స్ కానివ్వండి డ్రసింగ్ స్టైల్ కానివ్వండి ఎక్కడో ఒక చోట మనకు గాడ్ ఫాదర్ మూవీ కనిపిస్తుంది.

రామాయణం మొత్తం చదవకపోయిన కొన్ని సినిమాల్లో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో రామాయణం గురించి అంతో ఇంతో మనకు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమా కూడా అంతే.. కొన్ని సినిమాల్లో గాడ్ ఫాదర్ నుంచి కాపీ కొట్టిన సీన్స్ ను బట్టి గాడ్ ఫాదర్ మూవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఈ సినిమాలో వాడిన చాలా డైలాగులు ఆ సినిమా తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.. అలాగే సినిమాలోని కొన్ని పదాలు ఇప్పుడు వాడుక భాషలో కూడా ఉపయోగిస్తున్నారు. మనదగ్గర కాపీ రైట్ విషయం అంత పట్టించుకోరు. అందుకే ఈ సినిమాలోని సీన్స్ మన బాలీవుడ్ మూవీలో చాలా వరకు వాడేశారు. ధర్మాత్మ, ఆతాంక్ హాయ్ ఆటంక్,సర్కార్, రాజనీతి వంటి సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమాను గుర్తు చేస్తాయి. వీటితో పాటు ‘ నాయకన్ ‘ (1987), ‘ దయావన్ ‘ (1988), ‘ పరింద ‘ (1989) సినిమా కథలు గాడ్ ఫాదర్ ను పోలివుంటాయి. ఫైసల్ ఖాన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) ‘ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ ‘ (2012)  వంటి సినిమాల్లో గాడ్ ఫాదర్ మూవీ కనిపిస్తుంది. ఇలా ఇప్పటికీ ఈ సినిమా ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. అయితే గాడ్ ఫాదర్ లో మార్లొన్ బ్రాండొ పొషించిన డాన్ విటొ కొర్లీయొన్ పాత్రను రెండవ భాగంలో పొషించిన రాబర్ట్ డి నీరొకి 1974 సంవత్సర ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. ఒకే పాత్రను పొషించిన ఇద్దరు నటులకు ఆస్కార్ రావడం ఇదే ప్రథమం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..