AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ప్రమోషన్స్‌లో జక్కన్న నెక్ట్స్‌ లెవల్‌.. దేశాన్ని మొత్తం చుట్టేయనున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌..

RRR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood), ఆ మాటకొస్తే యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో అపజయం ఎరగని రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి....

RRR Movie: ప్రమోషన్స్‌లో జక్కన్న నెక్ట్స్‌ లెవల్‌.. దేశాన్ని మొత్తం చుట్టేయనున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌..
Rrr Movie
Narender Vaitla
|

Updated on: Mar 17, 2022 | 5:04 PM

Share

RRR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood), ఆ మాటకొస్తే యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో అపజయం ఎరగని రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారతీయ స్థాయిని బాహుబలి (Bahubali)తో ఓ మెట్టు ఎక్కించిన రాజమౌళి, ఇప్పుడు ఆర్ఆర్‌ఆర్‌ చిత్రంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్‌ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కరోనా కారణంగా సినిమా వాయిదా పడడంతో ప్రమోషన్స్‌ను బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సినిమా తేదీ ప్రకటించిన నాటి నుంచి మళ్లీ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేశారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ సుడిగాలి పర్యటన చేయనుంది. ఈ నెల 18న దుబాయ్‌లో జరగనున్న ఈవెంట్‌తో మొదలు కానున్న ఈ జర్నీ తర్వాత మార్చి 19న కర్ణాటక చిక్బల్లాపూర్‌లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌, మార్చి 20న ఢిల్లీ, మార్చి 21న అమృత్‌సర్‌, జైపూర్‌.. మార్చి 22న కోల్‌కతా, వారణాసి.. మళ్లీ 23వ తేదీన హైదరాబాద్‌తో ముగియనుంది. ఇలా ఆరు రోజుల పాటు ప్రమోషన్స్‌తో మొత్తం దేశాన్ని చుట్టేయనున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌. ఏది ఏమైనా ప్రమోషన్స్‌లో రాజమౌళికి మరెవరూ సాటిలేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు కదూ!

ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలియా భట్‌, శ్రీయా, అజయ్‌ దేవగణ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన మరెంతో మంది స్టార్‌ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Cyclone Asani: ఈ ఏడాది తొలి తుఫాన్‌ దూసుకొస్తోంది.. మార్చిన 21 తర్వాత ఆ ప్రాంతాల్లో భారీ వర్షం..

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ సెకండ్ సాంగ్ వచ్చేది అప్పుడే..

Russia-Ukraine War: రష్యాపై అగ్రరాజ్యం ఆగ్రహం.. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం..