Tollywood : వరుసగా వంద కోట్ల సినిమాలు.. హిట్లతో జోష్ మీదున్న హీరో.. తండ్రి మాత్రం జిరాక్స్ షాప్ నడిపిస్తూ..
సినీరంగంలో సక్సెస్ కావడం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. హీరోయిన్స్ విషయం పక్కనపెడితే హీరోలుగా తమకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం ఎన్నో సవాళ్లను దాటుకుని రావాలి. ప్రతిభతోపాటు కాసింత అదృష్టం తోడైతే ఇండస్ట్రీలో తిరుగుండదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే.

సినీరంగంలో హీరోగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదుర్కొని తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు గురించి చెప్పక్కర్లేదు. గాడ్ ఫాదర్ లేకపోయినా.. ఫ్యామిలీ పరిస్థితులు సహకరించకపోయినా.. తమ ప్రతిభను నమ్ముకుని ఇండస్ట్రీలో సక్సెస్ అయినవారు ఉన్నారు. అయితే కొడుకులు ఎంత సక్సెస్ అయినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఇంకా సింపుల్ గానే తమ జీవితాలను గడుపుతున్నారు. ఉదాహరణకు పాన్ ఇండియా స్టార్ హీరో యష్.. స్టార్ డమ్ సంపాదించుకున్నప్పటికీ ఆయన తండ్రి మాత్రం ఇంకా బస్ డ్రైవర్ గానే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరో హీరో తండ్రి సైతం ఇంకా జిరాక్స్ నడిపిస్తూనే ఉన్నారట. ఓవైపు తనయుడు వరుసగా వంద కోట్ల సినిమాలతో హిట్స్ అందుకుంటున్నా.. తన తండ్రి మాత్రం జిరాక్స్ షాప్ నడిపిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారట. ఆ హీరో మరెవరో కాదండి.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోన్న హీరో ప్రదీప్ రంగనాథన్.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ప్రస్తుతం తమిళం, తెలుగులో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. కోమలి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్.. లవ్ టుడే సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ వంద కోట్లు వసూలు చేసింది. ఇక ఈ తర్వాత డ్రాగన్ సినిమాతో మరో వందకోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. ఇక ఇప్పుడు హీరోగా మూడో సినిమా డ్యూడ్ సినిమాతో అడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తన తండ్రి జిరాక్స్ షాప్ నడుపుతున్నారని.. ఆయనకు బయట కనిపించడం ఫేమ్ అవ్వడం ఇష్టం ఉండదని అన్నారు. ఆయనకు కార్ కొనిస్తానని చెప్పినా.. ఇప్పటికీ బస్ లోనే వెళ్తారని.. సింపుల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తాను ఇంజనీరింగ్ లోనే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశానని.. అప్పుడు తన తండ్రి బాధపడ్డారని అన్నారు. ఇది హాబీ కోసమే.. కెరీర్ కాదని చెప్పానని.. కానీ కోమలి రిలీజ్ అయ్యాక అదే కెరీర్ అని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ప్రదీప్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

Pradeep Ranganathan Father
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.




