Mahesh Babu: ఆ సినిమా విషయంలో మహేష్ అలా అనడం బాధించింది.. ఎస్‌జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..
మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య దర్శకత్వంలో 'నాని' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2004లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ హీరోగా ఎదుగుతోన్న సమయంలో మహేష్ బాబు ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడం చాలా డేరింగ్ నిర్ణయం అని చెప్పాలి. అయితే..

మహేష్ బాబు హీరోగా తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య దర్శకత్వంలో ‘నాని’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2004లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ హీరోగా ఎదుగుతోన్న సమయంలో మహేష్ బాబు ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడం చాలా డేరింగ్ నిర్ణయం అని చెప్పాలి. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ మూటగట్టున్న మహేష్ గట్స్‌కి మాత్రం అందా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్య చాలా ఏళ్ల తర్వాత దీనిపై స్పందించారు. నాని సినిమా ఫ్లాప్ తర్వాత మహేష్ అన్న మాట తనను బాధించిందని చెప్పుకొచ్చారు.
ఎస్‌జే సూర్య తాజాగా నటించిన చిత్రం ‘వదంతి’. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య.. నాని సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని సినిమా విషయంలో ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయిందన్న సూర్య.. తాను పెద్ద హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చానని, కానీ దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రతీ సినిమాను ప్రేమతోనే చేస్తామని, శక్తినంతా ధారపోస్తామని కానీ నాని చిత్రంలో తప్పు జరిగిందని గుర్తుచేసుకున్నారు. ‘నాని సినిమా విడుదల తర్వాత ఓసారి మహేష్ మాట్లాడుతూ.. ‘మీరు ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫలితాన్ని పక్కన పెడితే.. మిమ్మల్ని, మీ పనితనాన్ని ఇష్టపడుతున్నా’అని తెలిపారన్నారు.
అయితే మహేష్ అలా అనడం తనను మరింత బాధించిందనన్న సూర్య.. మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం తాను యాక్టింగ్‌లో బిజీగా ఉన్నానని, నటనపై పిచ్చి తగ్గిన వెంటనే మళ్లీ దర్శకత్వం చేస్తానని తెలిపారు. అప్పుడు మహేష్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని, అందుకు ఆయన్ని ఒప్పిస్తానని సూర్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎస్‌జే సూర్య తెలుగులో పవన్ హీరోగా కొమరం పులి చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..