Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ.. తరలి వస్తున్న సినీప్రముఖులు, అభిమానులు
హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ దశ దినకర్మ నిర్వహిస్తున్నారు. కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ,
హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ దశ దినకర్మ నిర్వహిస్తున్నారు. కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఇక JRC కన్వెన్షన్ లో అభిమానుల కోసం ఏర్పాట్లుచేశారు. దీంతో పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు తరలివస్తున్నారు. సంస్మరణ సభలో అభిమానులు కృష్ణ విగ్రహాన్ని మహేశ్‌బాబుకు అందించనున్నారు.
ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. నటశేఖరుడి మరణంతో మహేష్ కుటుంబంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నెల14న అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ ఈ నెల 15న తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది.
Published on: Nov 27, 2022 12:01 PM
వైరల్ వీడియోలు
Latest Videos