AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: సంద్రం మధ్యలో సందడి చేస్తున్న ట్రెండీ బ్యూటీ.. ఇంతకీ కొత్త పెళ్లి కూతురు ఎవరో గుర్తుపట్టారా?

ఓ అందాల తార తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ట్రండీ డ్రస్‌లో కళ్లకు షేడ్స్‌తో, సముంద్రం మధ్యలో సందడి చేస్తున్న ఈ చిన్నది ఇటీవలే వివాహ బంధంతో ఓ ఇంటిది అయ్యింది...

Viral Photo: సంద్రం మధ్యలో సందడి చేస్తున్న ట్రెండీ బ్యూటీ.. ఇంతకీ కొత్త పెళ్లి కూతురు ఎవరో గుర్తుపట్టారా?
Narender Vaitla
|

Updated on: Apr 13, 2023 | 8:39 PM

Share

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా నెట్టింట సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు సోషల్‌ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. ఒకప్పుడు తమ వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని అందాల తారలు ఇప్పుడు ప్రతీ విషయాన్ని ఫ్యాన్స్‌తో ఇట్టే షేర్‌ చేసుకుంటున్నారు. తమ లేటెస్ట్‌ ఫొటోలతో పాటు పర్సనల్ టూర్స్‌ వరకు అన్నింటినీ నెట్టింట పెట్టేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ట్రండీ డ్రస్‌లో కళ్లకు షేడ్స్‌తో, సముంద్రం మధ్యలో సందడి చేస్తున్న ఈ చిన్నది ఇటీవలే వివాహ బంధంతో ఓ ఇంటిది అయ్యింది. బాల్య నటిగా కెరీర్‌ మొదలు పెట్టిన ఈ చిన్నది.. అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తెలుగుతో పాటు తమిళంలోనూ పలు హిట్‌ మూవీస్‌లో నటించిందీ చిన్నది.

ఇవి కూడా చదవండి

Viral Photo

ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ఈ మధ్య కాలంలోనే ఈ చిన్నది ఓ వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అయితే తన స్నేహితురాలి మాజీ భర్తనే వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చేసినట్లుంది కదూ! అవును మీరు ఊహిస్తోంది నిజమే. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార హన్సికానే. గతంలో వెళ్లిన టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘నీలి మేఘాలు, డెనిమ్‌ షార్ట్స్‌’ అంటూ క్యాప్షన్‌తో ఫొటోలు పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us