హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉందిగా..! ఉపేంద్ర కూతుర్ని చూశారా.?
ఎవరికీ అందని వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీస్తుంటారు, నటిస్తుంటారు హీరో ఉపేంద్ర. ఓమ్, ఏ, రా, ఉపేంద్ర, హెచ్ 2ఓ.. ఇలాంటి తదితర సినిమాలో చెబుతాయి ఉపేంద్ర ఎంతటి ట్యాలెంటెడ్ నటుడో, డైరెక్టరో అని. సమాజంలోని లోపాలను ఎత్తిచూపిస్తూ.. సెటైరికల్‌గా అదే సమయంలో ఎంటర్‌టైనింగ్ ఉండేలా ఆయన సినిమాలు రూపొందిస్తుంటారు.

సినిమా ఇండస్ట్రీలో ఉపేంద్ర స్టైల్ వేరు.. అందరు హీరోల్లా కాకుండా విభిన్నంగా ఉండటం, విభిన్నంగా సినిమాలు చేయడం ఉపేంద్రకే చెల్లింది. ఉపేంద్రకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓమ్, ఏ, రా, ఉపేంద్ర, హెచ్ 2ఓ, యూఐ.. ఇలా ఎవరికీ అందని వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీస్తుంటాడు, నటిస్తుంటాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. తనలో ఎంతో మంచి నటుడు ఉన్నాడో అంతే ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు. సమాజంలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్లు, సెటైరికల్‌గా, ఎంటర్‌టైనింగ్ గా చూపడంలో ఉపేంద్రది ప్రత్యేక శైలి. కన్నడ భాషతో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు నటుడు ఉపేంద్ర. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అలాగే రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించారు ఉపేంద్ర.
ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి
కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగానూ ప్రతిభా చాటుకున్న ఉపేంద్ర ఫ్యామిలీ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు ఆయన సతీమణి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వారే.. ఉపేంద్ర భార్య పేరు ప్రియాంక. ఆమె బెంగాలీ నటి. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. వీరి వివాహం 2003లో జరిగింది. ఇప్పుడు వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఉపేంద్ర భార్య తెలుగులోనూ సినిమాలు చేశారు. జేడీ చక్రవర్తి నాటింషన్ సూరి అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్
కాగా ఉపేంద్ర కూతురు పేరు ఐశ్వర్య. ఐశ్వర్య ఓ వైపు చదువుతూనే.. 2019లో ‘దేవకీ’ అనే చిత్రంతో నటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో ఆమె తల్లి ప్రియాంకతో కలిసి నటించింది. ఆతర్వాత మరో సినిమాలో నటించలేదు. కాగా ఐశ్వర్య సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తుంది. ఆమెకు జర్నలిజం అంటే ఆసక్తి అని, జర్నలిస్ట్ కావాలని కోరుకుంటోందట.. కాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఉపేంద్ర అభిమానులు ఆమె హీరోయిన్ లా ఉందని సినిమాల్లోకి వస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నదాని ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..
View this post on Instagram




