Sumbul Touqeer: తండ్రికి ‘మళ్లీ పెళ్లీ’ చేసిన ప్రముఖ నటి.. అమ్మకు వెల్కమ్ చెబుతూ ఎమోషనల్
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి సుంబల్ తౌకీర్ గురించి మన తెలుగు వారికి పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ టీవీ షోస్, సినిమాలు చూసే వారికి ఈ ముద్దుగుమ్మ బాగానే గుర్తుంటుంది. 2013లో షో జోధా అక్బర్‌తో బుల్లితెరకు పరిచయమైన..
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి సుంబల్ తౌకీర్ గురించి మన తెలుగు వారికి పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ టీవీ షోస్, సినిమాలు చూసే వారికి ఈ ముద్దుగుమ్మ బాగానే గుర్తుంటుంది. 2013లో షో జోధా అక్బర్‌తో బుల్లితెరకు పరిచయమైన సుంబుల్ ఇమ్లీ టీవీ షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ వెంటనే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యహరిస్తోన్న ప్రముఖ రియాలిట షో హిందీ బిగ్‌బాస్- 16 సీజన్‌లో అడుగుపెట్టింది. తద్వారా ఈ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు టీవీషోస్‌తో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైందీ సుంబల్. ఇదిలా ఉంటే తన తండ్రికి రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచిందీ బాలీవుడ్ అందాల తార. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి.
‘మేం చాలా హ్యాపీగా ఉన్నాం. కొత్త దంపతులను మా ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్ఆం. మా నాన్నగారి భార్యతో పాటు ఒక కొత్త సోదరి కూడా మా కుటుంబంలోకి వస్తోంది’ అని అంటూ హర్షం వ్యక్తం చేసింది సుంబల్. కాగా ఈ నటి తండ్రి పెళ్లి చేసుకున్న మహిళ పేరు నీలోఫర్. ఆమెకు ఇంతకు ముందే పెళ్లైంది. అయితే విడాకులు తీసుకుంది. తనకు రెండేళ్ల పాప కూడా ఉంది. సుంబల్ చేసిన పనిపై పలువురు ప్రశంసిస్తున్నారు. చాలా గొప్ప పనిచేశావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.