Bollywood Wives: బాలీవుడ్ లో కర్వా చౌత్ సందడి.. ఒకే చోటుకు చేరిన తారామణులు..

Surya Kala

Surya Kala |

Updated on: Oct 14, 2022 | 3:42 PM

పండుగలు నమ్మకం, విశ్వాసం, సంప్రదాయానికి సంబంధించినవని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. కర్వా చౌత్ మీ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం మాత్రమే కాదు, మహిళలు ఒకరినొకరు కలిసి సరదాగా జరుపుకునే పండగ రోజు కూడా అన్నారు సునీతా కపూర్

Bollywood Wives: బాలీవుడ్ లో కర్వా చౌత్ సందడి..  ఒకే చోటుకు చేరిన తారామణులు..
Bollywood Heroins

Follow us on

సనాతన ధర్మంలో పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే కర్వా చౌత్ వంటి పండగలను సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎంతో భక్తుశ్రద్ధలతో ఆచరిస్తారు. తమ భర్త ఆరోగ్యం కోసం.. దీర్ఘాయుస్సుని కోరుతూ ఈ రోజున వివాహిత మహిళలు ఉపవాసాన్ని చేస్తారు. ప్రత్యేకం గా గౌరీ పూజను చేసి సాయంత్రం చంద్రుడిని దర్శించి ఉపవాస దీక్షను విరమిస్తారు. తాజాగా బాలీవుడ్ భామలు అందరూ కలిసి బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ  సునీత కపూర్ తో కలిసి కర్వా చౌత్ పూజను చేసిన అనంతరం ఈ ముద్దుగుమ్మలు తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రవీనా, శిల్పా, మహీప్, నీలం, భావనా ​​పాండే, పద్మిని కొల్హాపురీ, నటాషా దలాల్, ఆంతరా మోతీవాలా మార్వా, అనిస్స మల్హోత్రా జైన్, జాన్వీ ధావన్, రిమా జైన్‌లతో పాటు సునీతతో సహా పలువురు మహిళలు ఉన్నారు. సునీత,  శిల్పాశెట్టితో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. సునీత మల్టీకలర్ లెహంగా ధరించగా, శిల్పా స్టైలిష్ రెడ్ చీరను ధరించింది.

ఇవి కూడా చదవండి

ప్రముఖ రియాలిటీ షో ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్.. నీలమ్ కొఠారి, మహీప్ కపూర్, భావన పాండే ఇతర నటులతో మెట్ల మీద కూర్చున్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో సునీత కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇస్తూ.. సునీత .. “పండుగలు నమ్మకం, విశ్వాసం, సంప్రదాయానికి సంబంధించినవని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. కర్వా చౌత్ మీ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం మాత్రమే కాదు, మహిళలు ఒకరినొకరు కలిసి సరదాగా జరుపుకునే పండగ రోజు కూడా. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా..  మీ నమ్మకం, విశ్వాసం ఏమైనప్పటికీ, ప్రేమ, ఆప్యాయతలతో కలిసి వేడుకలను జరుపుకునే రోజు.. మీకు కూడా ఈ పండగ శుభాలను తీసుకుని రావాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఈ పోస్ట్‌కు బాలీవుడ్ నటీనటులతో పాటు, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. “అందమైన లేడీస్,” ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు “బాలీవుడ్  హ్యాపీ భాబీస్” అని కామెంట్ చేశారు. సునీత ప్రతి సంవత్సరం తన కుటుంబ సభ్యులతో సహా, కర్వా చౌత్ ను జరుపుకుంటారు. బాలీవుడ్ లోని ముద్దుగుమ్మలు ఈ పండగ రోజున సునీత కపూర్ ఇంట్లో సందడి చేస్తారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu