AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hollywood: ఏంజెలీనా, బ్రాడ్ పిట్ విడాకుల కేసులో కొనసాగుతున్న న్యాయ పోరాటం.. తాజాగా ఏంజెలినా లెటర్ వైరల్..

బ్రాడ్ పిట్ మద్యపానాన్ని విడిచిపెట్టడానికి చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. బ్రాడ్ పిట్ 'తన వ్యసనంతో కుటుంబం జీవితానికి ముగింపు ఇచ్చాడు..  మద్యానికి బానిసగా మారి ఎప్పుడూ దాని చుట్టూ తిరిగాడు.

Hollywood: ఏంజెలీనా, బ్రాడ్ పిట్ విడాకుల కేసులో కొనసాగుతున్న న్యాయ పోరాటం.. తాజాగా ఏంజెలినా లెటర్ వైరల్..
Brad Pitt And Angelina Joli
Surya Kala
|

Updated on: Oct 14, 2022 | 11:25 AM

Share

హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్ , ఏంజెలీనా జోలీ మధ్య న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ జంట సెప్టెంబరు 2016లో విడాకుల కోసం దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో యుద్ధం జరుగుతూనే ఉంది. ఏంజెలీనా జోలీ , బ్రాడ్ పిట్ విడాకుల కేసులో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు స్టార్లు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు.  ఇదిలా ఉండగా తాజాగా ఏంజెలినా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లెటర్ ను ఏంజెలీనా 2021లో తన మాజీ భర్తకు పంపింది. ఈ లేఖను కూడా కోర్టులో సమర్పించారు.

వైరల్ అవుతున్న ఈ లేఖలో… ఏంజెలీనా ఇలా రాసింది, “ఇక్కడే మేము కవలలను (నాక్స్ , వివియెన్) ఇంటిలోని ఆహ్వానించాము. మా అమ్మ సాక్షిగా వివాహం చేసుకున్నాము. ఇక్కడే తమ జీవితాంతం గడుపుదామని.. తాను వృద్ధాప్య సమయంలో ఈ ఇంట్లోనే   ఉంటానని అనుకున్న స్థలం. ఈరోజు నేను కన్నీరు పెట్టకుండా ఉండడం నావల్ల కావడం లేదు. ఈ నా జ్ఞాపకాలను ఒక దశాబ్దం కాలం తర్వాత కూడా గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు ఏంజెలినా.”

వైన్ చుట్టూ జీవితం” బ్రాడ్ పిట్ మద్యపానాన్ని విడిచిపెట్టడానికి చేసిన పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. బ్రాడ్ పిట్ ‘తన వ్యసనంతో కుటుంబం జీవితానికి ముగింపు ఇచ్చాడు..  మద్యానికి బానిసగా మారి ఎప్పుడూ దాని చుట్టూ తిరిగాడు. అయితే ఏదొక రోజు అది మనల్ని ఒకచోట చేర్చి, మనకు కాంతి, శాంతిని ఇచ్చేదిగా మారుతుందని తాను ఆశించానట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు నన్ను నిజంగా ఎలా ఇష్టపడుతున్నారో ఇప్పుడు నేను చూస్తున్నానని లెటర్ లో ప్రస్తావించింది ఏంజెలినా.

ఇవి కూడా చదవండి

‘కుటుంబంపై చెడు అలవాట్ల ప్రభావం’

ఏంజెలీనా ఆ లేఖలో ఇంకా ఇలా రాసింది..  “వ్యాపారాన్ని పంచుకోవడానికి లేదా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపని విధానంతో పాటు..  బ్రాడ్ పిట్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల తాను బాధపడ్డానని పేర్కొన్నది. ఇటీవల మద్యం విక్రయం కోసం విడుదలైన చిత్రాలను చూసి కదిలిపోయాయని చెప్పింది ఏంజెలినా. తాను బ్రాడ్ పిట్ తీసుకున్న బాధ్యతారాహిత్య చర్యగా భావిస్తున్నానని .. తమ పిల్లలు దీన్ని చూడకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను బ్రాడ్ పిట్ తో ఉన్న సమయంలో ఎదురైనా చెడు సమయాన్నీ గుర్తు చేస్తుందన్నారు. తన మాజీ భర్త బ్రాడ్ పిట్‌కి చెందిన అనేక విషయాలు ఈ లెటర్ ద్వారా ఏంజెలినా తెలియజేసింది. బ్రాడ్ పిట్ తన చెడు అలవాట్లు .. తమ కుటుంబం, వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపిందో ఈ ఉత్తరం ద్వారా వివరించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్