Lata Mangeshkar: ఆఖరి రోజుల్లో శ్రీరామ నామ జపం చేసిన లతాజీ.. రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ప్రత్యేక శ్లోకాలు
తేనె కన్నా తీయనైన గానంతో ఎంతో మంది సంగీత అభిమానుల మనసులు గెల్చుకున్నారు లతా మంగేష్కర్. భారత దేశంలోని దిగ్గజ గాయకుల జాబితాను తీస్తే లతాజీ అగ్రస్థానంలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్నవయసులోనే పాటలు ఆలపించడం ప్రారంభించిన ఆమె కొన్ని దశాబ్దాల పాటు సంగీతంలో సేవలందించారు. . 36 భాషల్లో సుమారు 25 వేలకు పాటలు పాడిన ఘనత లతాజీ సొంతం.
తేనె కన్నా తీయనైన గానంతో ఎంతో మంది సంగీత అభిమానుల మనసులు గెల్చుకున్నారు లతా మంగేష్కర్. భారత దేశంలోని దిగ్గజ గాయకుల జాబితాను తీస్తే లతాజీ అగ్రస్థానంలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్నవయసులోనే పాటలు ఆలపించడం ప్రారంభించిన ఆమె కొన్ని దశాబ్దాల పాటు సంగీతంలో సేవలందించారు. . 36 భాషల్లో సుమారు 25 వేలకు పాటలు పాడిన ఘనత లతాజీ సొంతం. సంగీత రంగంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా’నైటింగేల్ ఆఫ్ ఇండియా’, ‘క్వీన్ ఆఫ్ ది మెలోడీ’, ‘వాయిస్ ఆఫ్ ది మిలీనియం’, ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ వంటి బిరుదులు అందుకున్నారామె. ఇలా వేలాది పాటలకు తన తీయనైన గాత్రంతో ప్రాణం పోసిన లతా మంగేష్కర్ గతేడాది ఫిబ్రవరి 6న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లెజెండరీ సింగర్ గురించి ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తన చివరి రోజుల్లో లతా మంగేష్కర్ రాముడి భజనలు, శ్లోకాలను రికార్డ్ చేశారట. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తాను పాడిన శ్లోకాలు, భజనలు ప్రసారం చేయాలన్నది ఆమె ఉద్దేశమట . లతా మంగేష్కర్ కన్నుమూసిన చాలా రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ రామమందిరాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ ప్రత్యేక సందర్భం కోసమే రాముడి భజనలు, శ్లోకాలను సిద్ధం చేశారట లతా మంగేష్కర్.
రామ భజనలు, శ్లోకాల రికార్డింగ్..
‘లతా తన చివరి రోజుల్లో రామ భజనలను రికార్డ్ చేసింది. ఇందుకోసం మ్యూజిక్ కంపోజర్ మయూరేష్ పైగేని ఇంటికి రమ్మని అడిగారు. కొన్ని రామ భజనలు, శ్లోకాలను ఎంచుకుని పాడి రికార్డ్ చేశారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం వీటిని రికార్డు చేశారు. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ పాటలు, శ్లోకాలను వినిపించాలన్నది లతాజీ ఉద్దేశం ‘ అని లత బంధువులు చెబుతున్నారు.
చనిపోయే ముందు వరకు పాడుతూనే..
లతాజీ ఆలోచనలను ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మయూరేష్ పాయ్ కూడా ధృవీకరించారు. ‘నాకు లతాజీతో మంచి అనుబంధం ఉండేది. ఆమె చనిపోయే ముందు వరకు పాడుతూనే ఉన్నారు. రామమందిరంలో తన గొంతు వినిపించాలనేది లతాజీ కోరిక. ఈ కారణంగా ఆరోగ్యం బాగాలేకున్నా రికార్డింగ్ ప్రారంభించారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతురాలు ఆమె’ అని మయూరేశ్ అన్నారు. మరి రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్ పాటలు వినిపిస్తారో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.