kangana ranaut : మరో సంచలన బయోపిక్ లో కంగనా… ఇందిరా గాంధీగా కాంట్రవర్సీ క్వీన్

ఎప్పుడూ వివిదాలతో సహవాసం చేస్తూ... క్వీన్‌ ఆఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న కంగనారనౌత్‌.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేశారు. ఓ లెజెండరీ పొలిటికల్ పర్సన్‌గా మన ముందుకు రాబోతున్నారు.

kangana ranaut : మరో సంచలన బయోపిక్ లో కంగనా... ఇందిరా గాంధీగా కాంట్రవర్సీ క్వీన్
kangana ranaut
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 28, 2021 | 11:31 AM

kangana ranaut : ఎప్పుడూ వివిదాలతో సహవాసం చేస్తూ… క్వీన్‌ ఆఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న కంగనారనౌత్‌.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ కొట్టేశారు. ఓ లెజెండరీ పొలిటికల్ పర్సన్‌గా మన ముందుకు రాబోతున్నారు. తమిళ్ లెజెండరీ అండ్ స్టబర్న్‌ పొలిటీషియన్‌ జయలలిత బయోపిక్‌లో రీసెంట్‌గా నటించిన కంగనా… తాజాగా మరో లెజెండరీ పొలిటికల్ పర్సన్‌ జీవితాన్ని రిప్రజెంట్ చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ఇందిరా గాంధీగా నటించబోతున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటించారు. ఇటీవల ఈ సినిమా తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇది విడుదల కాకముందే మరో చిత్రాన్ని ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. భార‌త‌దేశ దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో తాను న‌టించ‌బోతున్న‌ట్లు కంగ‌నా అధికారికంగా తెలిపారు.

అయితే ఇది బయోపిక్ కాదట. కేవలం ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. కంగనా సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తుండగా, సాయి క‌బీర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ పీరియాడిక్, పొలిటికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. అంతేకాదు అప్పటి, ఇప్పటి రాజకీయ పరిస్థితులకు తార్కానంగా ఈ సినిమా ఉండబోనుందట. వివాదాలకు పర్యాయపదంలా ఉండే కంగనా.. ఇలాంటి ఓ సెన్సిటివ్‌ కథలో నటిస్తుండడంతో.. ఈ సినిమా పైనే అందరిచూపు ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతోందో..!

మరిన్ని ఇక్కడ చదవండి :

Harish Pawan: బ‌ద్రిని మ‌రోసారి ప‌రిచ‌యం చేయ‌నున్న హ‌రీష్ శంక‌ర్‌.. ప‌వ‌న్ 28వ చిత్రానికి సంబంధించి..

వర్మ కు వచ్చిన అతి పెద్ద డౌట్.. పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి .

Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ.. మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌..

Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..