Harish Pawan: బ‌ద్రిని మ‌రోసారి ప‌రిచ‌యం చేయ‌నున్న హ‌రీష్ శంక‌ర్‌.. ప‌వ‌న్ 28వ చిత్రానికి సంబంధించి..

Harish Pawan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బ‌ద్రి సినిమాకు ఓ ప్ర‌త్యేక స్థానం ఉందని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ప‌వ‌న్‌లోని ఎన‌ర్జీని పూర్తిగా వాడుకున్నారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌...

Harish Pawan: బ‌ద్రిని మ‌రోసారి ప‌రిచ‌యం చేయ‌నున్న హ‌రీష్ శంక‌ర్‌.. ప‌వ‌న్ 28వ చిత్రానికి సంబంధించి..
Pspk 28th Home
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 28, 2021 | 11:18 AM

Harish Pawan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బ‌ద్రి సినిమాకు ఓ ప్ర‌త్యేక స్థానం ఉందని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ప‌వ‌న్‌లోని ఎన‌ర్జీని పూర్తిగా వాడుకున్నారు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. పూరీ మార్క్ డైలాగ్‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎన‌ర్జిటిక్ యాక్ష‌న్ తోడుకావ‌డంతో ఈ సినిమా ప‌వ‌ర్‌ స్టార్ అభిమానులకు వీనుల విందు చేసింది. అయితే మ‌రోసారి ప‌వ‌న్‌లో ఆ రేంజ్ ఎన‌ర్జీని ప్రేక్ష‌కుల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 28వ చిత్రాన్ని హ‌రీశ్‌తో చేయ‌నున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా కోసం హ‌రీశ్ ఇప్ప‌టికే పనులు మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే తాజాగా హ‌రీశ్ శంక‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా పోస్ట్ చేసిన ఓ వీడియో ప‌వ‌న్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ‌ద్రీకి సినిమాకు సంబంధించి ప‌వ‌న్ చెప్పే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌ల‌తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేసిన హ‌రీశ్‌.. `మ‌రోసారి ఇదే ఎన‌ర్జీని చూద్దాం` అంటూ క్యాప్ష‌న్ జోడించారు. దీంతో ప‌వ‌న్ మ‌రోసారి బద్రి స్థాయి విజయాన్ని అందుకోవ‌డం ఖాయం అంటూ ప‌వ‌న్‌ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస అప‌జ‌యాలు ఎదుర్కొంటోన్న స‌మ‌యంలో హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి ఎక్కారు. దీంతో మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి నెలకొంది.

హ‌రీశ్ చేసిన పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Harish Shankar (@harish2you)

Also Read: Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ.. మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌..

Senior Actress Simran: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్

Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!