Brahmaji: చైనా అధ్యక్షుడిని కలిసిన బ్రహ్మాజీ.. మా ఎన్నికలపై చర్చ.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్..
Brahmaji: ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల హంగామా తార స్థాయికి చేరింది. ఏకంగా నలుగురు పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక పోటీల్లో నిల్చున్న వారు ప్రెస్ మీట్‌లు పెడుతూ చేస్తోన్న పలు వ్యాఖ్యలు...
Brahmaji: ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల హంగామా తార స్థాయికి చేరింది. ఏకంగా నలుగురు పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక పోటీల్లో నిల్చున్న వారు ప్రెస్ మీట్‌లు పెడుతూ చేస్తోన్న పలు వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. అయితే మా ఎన్నికల హడావుడి వాడివేడీగా సాగుతోన్నవేళ నటుడు బ్రహ్మాజీ ఓ పోస్టుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నటుడు బ్రహ్మాజీ ఇటీవల చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను కలిశాడు. ఆ సమయంలో జింగ్‌పిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. బ్రహ్మాజీ మాత్రం రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఇక ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. `ఇది సాధారణ సమావేశం మాత్రమే. ఎలాంటి రాజకీయ అంశాలు చర్చించలేదు. త్వరలో జరగబోయే మా ఎన్నికల గురించి చర్చించాం. చైనా అధ్యక్షుడు కొన్ని సలహాలు ఇచ్చారు` అంటూ క్యాప్షన్ జోడించారు. ఏంటీ… ఇదంతా నిజమే అనుకుంటున్నారా? కాదులేండి.. సినిమాల్లో తన ఫన్నీ నటతో ఆకట్టుకునే బ్రహ్మాజీ సోషల్ మీడియాలోనూ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే చైనా అధ్యక్షుడితో కలిసి ఫొటో దిగినట్లు రూపొందించిన ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
బ్రహ్మాజీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..
kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..
స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు.. క్రికెటర్ ను వివాహమాడిన శంకర్ కుమార్తె ఐశ్వర్య ..