వర్మ కు వచ్చిన అతి పెద్ద డౌట్.. పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి .

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jun 28, 2021 | 10:52 AM

వివాదాల వర్మకు  డౌట్ వచ్చిందంట.. మరి ఇది మనసులో వచ్చే ఆలోచనో.. లేక మనిషే అలానో.. తెలియదు కాని ఎవ్వరికీ రాని వింత డౌట్లన్నీ ఆర్జీవీకే వస్తాయి.

వర్మ కు వచ్చిన అతి పెద్ద డౌట్.. పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి  .
Rgv Tweet

వివాదాల వర్మకు  డౌట్ వచ్చిందంట.. మరి ఇది మనసులో వచ్చే ఆలోచనో.. లేక మనిషే అలానో.. తెలియదు కాని ఎవ్వరికీ రాని వింత డౌట్లన్నీ ఆర్జీవీకే వస్తాయి. డౌట్  ఆలస్యం వెంటనే ఫోన్ అందుకుంటారు. అంతే అవి ట్వీట్ల రూపంలో మన హోమ్‌ పేజీలోకి వచ్చి చేరుతాయి.. ఆ తరువాత షరామామూలుగానే నెట్టింట వైరల్ అవుతుంటాయి. అదంతా ఓకే.. మరి ఈ డైరెక్టర్‌కి ఇప్పుడేం డౌట్ వచ్చిందాని అనుకుంటున్నారా..!. వచ్చింది చిన్న డౌట్ కాదు ఈ సారి పెద్ద  డౌటే వచ్చింది! కోవిడ్‌ వైరస్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారనే అనేది వర్మకు వచ్చిన డౌట్.  Bi7172, Nk4421, K9472 ,AV415 ఏంటీ ఏబీసీలు విత్ నెంబర్లు అని అనుకుంటున్నారా… ఇవి నెంబర్లు కావు.. వైరస్‌ పేర్లు. ఇది తెలుసుకున్నాకే రాము బ్రెయిన్‌లో వైరస్‌ తిరిగింది. దాంతో బుల్లి బుల్లి వైరస్‌లకు అసలా పేర్లేంటి… అలాఎందుకు పెడతారనే డౌట్‌ కూడా  ఆయనకు వచ్చిందంట.

“పాపం అవి కూడా ప్రాణులే వాటికి కూడా మనోభావాలుంటాయి. మీరు అలా నోరు తిరగని.. పేర్లతో పిలుస్తున్నారు కనుకే అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి”.. ఏ ఎల్లయ్య, పుల్లయ్య, ప్యారేలాల్‌, చింటూ, జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు లాంటి పేర్లు పెట్టొచ్చు కదాని.. తన డౌట్‌ను ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఓ షాకింగ్‌ ఎమోజీలు పెట్టి షాకయ్యా.. అన్నట్టు  చెప్పుకొచ్చారు క్రేజీ ఆర్జీవీ. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.

మరిన్ని  ఇక్కడ చదవండి :

Brahmaji: చైనా అధ్య‌క్షుడిని క‌లిసిన బ్ర‌హ్మాజీ.. మా ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌..

Keerthy Suresh: కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..

Senior Actress Simran: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu