Actress Simran: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్

Actress Simran: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలుగు వెలిగింది సిమ్రాన్. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోను జత కట్టి స్టార్ హీరోయిన్ గా..

Actress Simran: రమ్యకృష్ణ, నదియాల బాటలో మరో హీరోయిన్.. కార్తీ కోసం విలన్ గా నటించనున్న సిమ్రాన్
Simran
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 10:47 AM

Actress Simran: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలుగు వెలిగింది సిమ్రాన్. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోను జత కట్టి స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే తాజగా మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే ఒకటీ హీరోయిన్లు.. పెళ్లి అయ్యాక ఫేడ్ అవుట్ అయ్యాక రూటు మార్చి సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నారు. అక్కగా, అమ్మగా, అత్తగా రాణిస్తూ… క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. అప్పుడు గ్లామర్ తో రాణించిన హీరోయిన్లు ఇప్పుడు డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తూ.. నటనకే పెద్ద పీట వేస్తున్నారు.

మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్లుగా నటించిన భామలు కొంచెం వయసు వచ్చిన తర్వాత అక్క, వదిన, తల్లి, ప్రతినాయిక పాత్రలకు షిప్ట్ అవుతున్నారు. ఇప్పటికే రోజా, రమ్యకృష్ణ, నదియా వంటి అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఒకప్పట్టి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కూడా చేరింది.

అబ్బాయిగారి పెళ్లి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సిమ్రాన్.. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో పాటు యంగ్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న సిమ్రాన్ ఇటీవలె సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న వైవిధ్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తి నటిస్తున్న “సర్దార్” మూవీలో సిమ్రాన్ నెగిటివ్‌ రోల్‌ చేయనుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సిమ్రాన్‌ పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: రిజిస్టర్ ఆఫీసుకు చేసిన కార్తీక్, మోనిత ల పెళ్లి.. మోనితను చంపేస్తానేమో అంటున్న దీప

కీర్తి సురేష్ అభిమానులకోసం మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా 50మందికి..

తీపి పులుపు కలిసిన టేస్టీ టేస్టీ లెమన్ టీ తయారీ విధానం.. తులసి కలిపితే కలిగే ఆరోగ్య ఫలితాలు