Karthika Deepam: రిజిస్టర్ ఆఫీసుకు చేరిన కార్తీక్, మోనిత ల పెళ్లి.. మోనితను చంపేస్తానేమో అంటున్న దీప

Karthika Deepam: . ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప దగ్గరకు సౌందర్య పిల్లని తీసుకుని వస్తుంది. ఆటో కడుతున్న దీపని చూసి.. మీరా లోపల కూర్చోండి..

Karthika Deepam: రిజిస్టర్ ఆఫీసుకు చేరిన కార్తీక్, మోనిత ల పెళ్లి.. మోనితను చంపేస్తానేమో అంటున్న దీప
Karthika Deepam
Follow us
Surya Kala

| Edited By: Rajeev Rayala

Updated on: Jun 28, 2021 | 10:01 AM

Karhika Deepam : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1077 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత పెళ్లి ప్రయత్నాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం.. దీప దగ్గరకు సౌందర్య పిల్లని తీసుకుని వస్తుంది. ఆటో కడుతున్న దీపని చూసి.. మీరా లోపల కూర్చోండి.. అంటుంది. దీప నా ఆలోచనలు దరిద్రం పట్టినల్టు పీడిస్తున్నాయి అంటుంది.. సౌందర్య కు మోనిత ఇక్కడకి వచ్చిందా అని ఆలోచిస్తూ.. కార్తీక్ ఎడి అని ఆడుతుంది. రథాన్ని తోలడానికి రాణిగారిని ఎక్కించుకెళ్ళాడు. అంటే.. ఇంతలో పిల్లలు వచ్చి అమ్మా అంటే.. పిల్లల ముందు అరవకు అని అంటుంది సౌందర్య. కారులో పెద్ద కొండ మీదకు తీసుకుని వెళ్ళండి.. అక్కడ అరచి అరచి గొంతు అరిగిపోయాక తీసుకుని వస్తా అంటుంది దీప. శౌర్య వారణాసి ని తిడుతుంటే.. దీప అడ్డుపడుతుంది హిమ మేము ఆటో కడిగేసి వస్తామంటే.. సౌందర్య దీపని లోపలి తీసుకుని వెళ్తుంది. పిల్లలని ఆటో కడకుండా వారణాసి అడ్డుకుంటాడు.

మోనిత కార్తీక్ ని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకుని వెళ్తుంది. అది చూసి కార్తీక్ షాక్ తింటాడు. రిజిస్టర్ ఆఫీసుకు ఎందుకు.. నేను అందరి ముందు ప్రశ్నార్ధకంగా నిలబడాలి.. అంటే మరి నేను ప్రపంచానికి ఏమి చెప్పాలి దిగు అంటుంది.. ఇప్పుడా అని కార్తీక్ అంటే.. నాకు నీకు ఇంత అగమ్య గోచరంగా ఉండేవారం కాదు.. ఈ గమ్యానికి వచ్చే వాళ్ళం కాదు అంటుంది మోనిత. కార్తీక్ కారు డోర్ మూయడం మరచిపోయాడు అంటూ.. కారు కీ తీసుకుని డోర్ వేసి.. రా కార్తీక్ అంటూ రిజిస్టర్ ఆఫీస్ లోపలికి రా అంటూ. ఏమైంది కార్తీక్ అంత టెన్షన్ గా ఉన్నావు.. నన్ను చూస్తే నిజంగా భయమేస్తుందా అంటే.. నాకు గుర్తు లేదు సృహ లేదు ఆ స్పర్శ లేదు ఆ సంఘటన తాలూకా అనుభూతి లేదు కానీ మన మధ్య స్నేహం ఉంది.. ఆ స్నేహం చూపించే సాక్ష్యం ఉంది.. కానీ నమ్మాలని లేదు నమ్మక తప్పడం లేదు విన్నవాళ్లంతా నమ్ముతూనే ఉన్నారు.. విచిత్రంగా నేను వినేవాళ్లలో ఒక్కడిని అయ్యాను.. నువ్వు చెప్పే కథనానికి ప్రేక్షకుడిని నన్నయ్యను అంటూ కార్తీక్ .. మాట్లాడుతుంటే.. మోనిత అనుమానంతో చూస్తుంది. ఈ పరిస్థితి నన్ను శూన్యంలో నిలబెట్టింది.. దీప ముందు నన్ను దోషిలా నిలబెట్టింది అంటుంటే.. మా అమ్మ ముందు సంస్కారం లేని మనిషిగా పాతాళంలోకి నెట్టేసింది.. ఇదంతా నాకు జీర్ణం కాకముందే నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే అని కార్తీక్.. అయోమయంతో మోనితతో చెబుతాడు.

నీకుగుర్తు లేకపోయినా జ్ఞాపకం లేకపోయినా సాక్ష్యం ఉంది అంటుంది మోనిత. ఈ సాక్ష్యానికి నువ్వే తండ్రివన్న సాక్ష్యం కావాలి.. లేదంటే శౌర్య పెరిగినట్లు పెరగాలి.. కేరాఫ్ గా కాదు.. సన్నాఫ్ గా పెరగాలి.. ఇద్దరి తప్పని ఒప్పు గా మార్చుకోవడానికి మన ఇద్దరి సంతకాలు ఉపయోగపడతాయి. లోపలి వెళ్తే.. వెంటనే దండాలు మార్చుకోమనరు. నీకు జీర్ణం కావడానికి టైం ఇస్తారు అంటుంది మోనిత. నాకు న్యాయం జరగడానికి శ్రీకారం చుడతారు రా కార్తీక్ అంటూ.. చేయి పట్టుకుని మోనిత లోపలికి తీసుకుని వెళ్తుంది.

మరోవైపు దీప మోనిత మాటలను గుర్తు చేసుకుంటుంది. సౌందర్య మంచినీరు తెచ్చిదీపకు ఇస్తుంది. ఏమిటి దీప ఇది.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నావు.. పేలబోయే అగ్ని పర్వతంగా కనిపిస్తున్నావు.. తుఫాన్ రాబోయే ముందు ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. ఒక్కసారి తుఫాన్ మొదలైతే నిశ్శబ్దం అంత మాయమై.. శబ్దం మొదలవుతుంది. ఆడొచ్చింది. రమ్మంది కలిసి వెళ్లిపోయారు ఇదంతా నా ముందే జరిగింది. అప్పుడు ఈ సముద్ర గర్భంలో ఎన్ని సుడిగుండాలు తిరుగుతాయో తెలుసా మీకు అనిప్రశ్నిస్తుంది సౌందర్యని ఎవరు ఎవరికీ ఏమవుతారు.. ఎవరు ఎవరిని శాసిస్తున్నారు.. ఎవరు ఎవరికీ ఎప్పుడు లొంగిపోయారు అంటూ దీప మాట్లాడుతుంటే సౌందర్య షాక్ తో వింటుంది. ఇదంతా చూస్తుంటే కన్నీరు కుంభవృష్టిలా కురవలేదు.. ఆవేశం ఎగసిపడింది. చంపేస్తానేమో ఆ మోనిత అన్నంత ఉక్రోషం అంటుంటే.. సౌందర్య మోనిత పెళ్లి విషయం గుర్తు చేసుకుని చెప్పకపోవడమే మంచిది అని తనలో తనే అనుకుంటుంది.

నీ సౌభాగ్యాన్ని మరో స్త్రీ దోచుకుంటుంటే.. స్త్రీ సహజమైన ఆవేశం పొంగి పొరలి వస్తుంది. నీ కాపురంలో చిచ్చు పెట్టడానికే పుట్టిన ఆ మోనిత ని నేను వాడు ఏమీ చేయకపోవడం నీకు అసంతృప్తి మొదలైంది. దానిని కార్తీక్ వైపు జీవితంలో చూడకుండా చేయగలిగే సత్తా నీకున్న నీలో సంస్కరం పట్టి ఆపుతుంది. ఇప్పుడు నేను ఏమి చేయాలి అత్తయ్య చావనా చంపనా ఆశలు చంపుకోనా అంటుంది

మోనిత కార్తీక్ తో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూర్చుని దీపతో పెళ్లి సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. వెళ్ళిపోదాం ఎందుకు అంటే.. ఇంకెప్పుడు తీసుకుంటావు.. ప్రపంచం అంతా నా గురించి తప్పుడు మాటలంటే.. కార్తీక్ ఆపు చేస్తాడు. ఏ వినలేకపోతున్నావా .. రేపు నాకు నా బిడ్డకు ఆ కర్మ పట్టనివ్వను అంటుంది ఇలా చూడు నేను మోనిత ని స్నేహితురాలిని.. నీ కష్టంలో సుఖంలో తోడున్నదానిని .. అబద్ధం చెబుతానా 16 ఏళ్లుగా ప్రేమిస్తున్నదానిని. మన ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నా నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నువ్వే అంటుంది.. కూర్చో మనం తప్పు చేసిన వాళ్ళలా కాకుండా ఆ తప్పుని సరిదిద్దుకునే వారిలా నిలబడం అపుడే నాకు శాంతి.. అంటుంటే.. మరి నా కుటుంబం ముందు ఎలా నిలబడాలి అని ప్రశ్నిస్తాడు.. ఏ మొహంతో నిలబడాలి.. ఏ పేరుతొ నిలబడాలి.. ఎం సాధించినవాడిగా నిలబడాలి మోనిత కు న్యాయం చేసినవాడిగా ధర్మం తప్పనివాడిగా నిలబడాలి అంటుంది.. రిజిస్ట్రార్ ఆఫీసర్ వస్తారు.

పెళ్ళికి సాక్ష్యంగా వచ్చారా అంటే.. లేదు పెళ్లి చేసుకోవడం కోసం వచ్చాము.. 25 వ తేదీ మంచిది.. ఆరోజు పెళ్లి చేసుకోవాటానికి వచ్చాము అంటుంది. వచ్చే నెల 25 తేదీ అంటే.. లేదు ఈ నెల 25వ తేదీ అంటుంది. పెళ్లి చేసుకుంటే ఎలాగైనా ప్రపంచం నోటీసుకుని వెళ్తుంది.. మేమిద్దరమే మేజేర్స్ కదా.. మా ఇద్దరి పెళ్ళికి అభ్యంతరం చెప్పేవారు లేరు.. వాయిదా వేసుకోవడానికి వడ్డీ లెక్క కాదుగా కూర్చో అంటుంది. ఇప్పుడు నాకు మూడో నెల అని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో మోనిత ఏమనుకుంటున్నావు నా గురించి .. నాలో మానవత్వం అనేది ఉంటె దీపకి గుడి కట్టాలి నేను .. ఆమె జీవితానికి సమాధి కట్టమంటున్నావు నువ్వు అంటాడు.

Also Read: కర్ణుడికి వరమిస్తానన్న కృష్ణుడు.. రాధేయుడు అడిగిన వరం విన్న కన్నయ్య కంట కన్నీరు..