Ankita Lokhande: బిగ్‏బాస్‏లోకి అంకిత లోఖండే.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి..

హాలీవుడ్ నుంచి మన ఇండియన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్‏బాస్‏ రియాల్టీ షోకు ఇక్కడ ఆదరణ ఎక్కువే. ఈ షోలో పాల్గోనాలని చాలా మంది అనుకుంటారు.

Ankita Lokhande: బిగ్‏బాస్‏లోకి  అంకిత లోఖండే..  రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి..
Ankitha Lokhande
Follow us

|

Updated on: Jun 28, 2021 | 3:20 PM

హాలీవుడ్ నుంచి మన ఇండియన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్‏బాస్‏ రియాల్టీ షోకు ఇక్కడ ఆదరణ ఎక్కువే. ఈ షోలో పాల్గోనాలని చాలా మంది అనుకుంటారు. కొందరికి ఈ షో గుర్తింపు తీసుకురాగా.. మరికొందరికి ఓ పీడకలగా మిగిలిపోతుంది. అందుకే ఇందులోకి వెళ్లడానికి చాలా మంది సెలబ్రెటీలు ఆలోచిస్తుంటారు. మొదట హిందీలో ప్రసారమైన ఈ షో.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు హిందీలో 14 సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‏బాస్‏ షో.. ఇప్పుడు 15వ సీజన్ కోసం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే.. సీజన్ 15లో పాల్గోనే కంటెస్టెంట్స్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే బుల్లితెర నటి.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి నటి అంకిత లోఖండే కూడా పాల్గోనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ పై నటి అంకిత లోఖండే స్పందించింది. ఈ సంవత్సరం నేను బిగ్‏బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు చదివాను. కానీ అవి అసత్యం. నేను ఆ షోలో భాగం కావడం లేదు. నేను ఇందులో భాగం కానప్పటికీ ప్రజలు నన్ను ద్వేషించడంలో మాత్రం ముందున్నారు అంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

బుల్లితెర ప్రేక్షకులకు అంకిత లోఖండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ప్రసారమైన పవిత్ర రిష్తా అనే సీరియల్ లో సుశాంత్ సింగ్ కు జోడీగా అంకిత నటించిది. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనుహ్యంగా వీరిద్దరూ రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు.

ట్వీట్..

Also Read: TTD Ex chairman : కరోనా నియంత్రణ సామాగ్రిని ఆస్పత్రులకు పంపిణీ చేసిన టీటీడీ పూర్వపు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TS Inter Results: తెలంగాణ ఇంట‌ర్ స్టూడెంట్స్ అల‌ర్ట్‌.. రేప‌టికి వాయిదా ప‌డ్డ ప‌రీక్షా ఫ‌లితాలు.. అనివార్య కార‌ణాల‌తో..

PM Kisan Samman : పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చివరి తేది జూన్ 30..! ప్రయోజనం పొందాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి..