Sudheer Babu : స్పీడ్ పెంచిన సుధీర్ బాబు.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్ ..
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. 'పలాస 1978' దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కథాంశంతో తెరెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మెలోడీ బ్రహ్మం మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మధ్యనే డబ్బింగ్ పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సుధీర్ బాబు వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే లైటింగ్ సూరిబాబు అనే రోల్ లో సుధీర్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క మ్యాచో బాడీతో కూడా ఆశ్చర్యపరిచాడు.
మొదటి నుంచి సుదీర్ బాబు తన సినిమాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటూ వస్తున్నారు. డిఫరెంట్ గా ట్రై చేసిన వి సినిమా బోల్తా కొట్టినప్పటికీ సుధీర్ బాబు నటన అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో పాటు.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో ఓ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు.
Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way ? ?
#70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk
— Sudheer Babu (@isudheerbabu) June 26, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :