AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు.. క్రికెటర్ ను వివాహమాడిన శంకర్ కుమార్తె ఐశ్వర్య ..

సౌత్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఇంట పెళ్ళిసందడి నెలకొంది. శంకర్ పెద్దకూతురు ఐశ్వర్య పెళ్లి పీటలెక్కింది.

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు.. క్రికెటర్ ను వివాహమాడిన శంకర్ కుమార్తె ఐశ్వర్య ..
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2021 | 7:28 AM

Share

సౌత్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ ఇంట పెళ్ళిసందడి నెలకొంది. శంకర్ పెద్దకూతురు ఐశ్వర్య పెళ్లి పీటలెక్కింది. జూన్ 27న ఐశ్వర్య వివాహం తమిళనాడుకి చెందిన క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరిగింది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో పెళ్లి వేడుకలు మాములుగానే జరిపారు.

333

అతికొద్ది మంది బంధువుల సమక్షంలో.. స్నేహితులు – శ్రేయోభిలాషుల మధ్యలో ఐశ్వర్య – రోహిత్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. శంకర్  కుమార్తె ఐశ్వర్య వృత్తి పరంగా డాక్టర్. కాగా పెళ్ళికొడుకు రోహిత్ దామోదరన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టిఎన్ పీఎల్)లో క్రికెటర్ గా ఉన్నాడు. అయితే రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో బడా వ్యాపారవేత్త. అలాగే తమిళనాడులోని మధురై పాంథర్స్ క్రికెట్ టీమ్ కు స్పాన్సర్ గా కూడా ఉన్నారు. 

3333

 వేదమంత్రాల సాక్షిగా ఐశ్వర్య రోహిత్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

33

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Fan: పెద్ద సాహ‌సం చేసిన ర‌ష్మిక అభిమాని.. గూగుల్‌లో వెతికి 900 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం..కానీ చివ‌రికి..

Sharwanand: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న శ‌ర్వానంద్‌.. మ‌హా స‌ముద్రం కోసం పారితోష‌కం త‌గ్గించుకున్న యంగ్ హీరో.

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?