Sharwanand: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న శ‌ర్వానంద్‌.. మ‌హా స‌ముద్రం కోసం పారితోష‌కం త‌గ్గించుకున్న యంగ్ హీరో.

Sharwanand: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపినట్లే సినిమా రంగంపై కూడా తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నో సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో చాలా మంది...

Sharwanand: కీల‌క నిర్ణ‌యం తీసుకున్న శ‌ర్వానంద్‌.. మ‌హా స‌ముద్రం కోసం పారితోష‌కం త‌గ్గించుకున్న యంగ్ హీరో.
Sharwand Remunaration
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 27, 2021 | 9:41 PM

Sharwanand: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపినట్లే సినిమా రంగంపై కూడా తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నో సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో చాలా మంది సినీ కార్మికులు ఉపాధ‌ని కోల్పోయారు. ఇక నిర్మాత‌లు సైతం ఆర్థికంగా బాగా న‌ష్ట‌పోయారు. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకునే కొంత మంది తార‌లు త‌మ రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యంగ్ హీరో శ‌ర్వానంద్ వ‌చ్చి చేరిన‌ట్లు తెలుస్తోంది. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం మ‌హాస‌ముద్రం సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆర్ఎక్స్‌100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ కూడా న‌టిస్తున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో శర్వానంద్‌ ఈ సినిమాకు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ని తెలుస్తోంది. సాధారణంగా రూ. 6 నుంచి 7 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకునే శ‌ర్వానంద్ మ‌హా స‌ముద్రం కోసం త‌న పారితోష‌కాన్ని ఏకంగా రూ. 2 కోట్లు త‌గ్గించునున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దు కానీ.. ఒక‌వేళ నిజ‌మే అయితే మాత్రం నిజంగా ఇండ‌స్ట్రీకి మేలు చేసిన వార‌వుతార‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: Shruti Haasan: కుంద‌న‌పు బొమ్మ‌.. చీర‌లో ఎంత అందంగా ఉన్నావ‌మ్మా..!

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేసుకున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

Rashmika Mandanna: ఫ్యాన్‌ ఫాలోయింగ్ విషయంలో జట్‌ స్పీడుతో దూసుకుపోతున్న రష్మిక