Sonu Sood: సోనూసూద్‌ను కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావాలని పిలుపు..

AP MRPS leaders met Sonu Sood : కలియుగ కర్ణుడు, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ను ఏపీ ఎమ్మార్పీఎస్

Sonu Sood: సోనూసూద్‌ను కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు.. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావాలని పిలుపు..
Ap Mrps Leaders
Follow us
uppula Raju

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 28, 2021 | 12:46 PM

AP MRPS leaders met Sonu Sood : కలియుగ కర్ణుడు, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ను ఏపీ ఎమ్మార్పీఎస్ కడప జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలిసారు. వీరబల్లి మండల నేతలు నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్‌లు ఆదివారం ముంబైలోని సోనూ సూద్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతడిని మండలంలోని గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీనికి సోనూసూద్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న వెంకటసాయి చంద్ర అనే వ్యక్తిని నేతలు సోనూసూద్ దగ్గరికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి గురించి వివరించారు. దీనికి చలించిపోయిన సోనూసూద్ బాధిత విద్యార్థిని వెంటనే మొంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించుకోమని తెలిపారు. కాలు బాగు అయ్యేవరకు ముంబైలోనే ఉండి చూపించుకోమని సలహా ఇచ్చారు. ఆ విద్యార్థికి వైద్య ఖర్చులు ఎంతైనా తానే భరిస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు.

కాగా లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి, సొంతింటికి వెళ్లడానికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డ వలస కార్మికులు అన్నీ తానై ఆదుకున్నాడు నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌ పాత్రలను పోషించే సోనూసూద్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. ట్విట్టర్‌ వేదికగా ఎవరేం అడిగినా లేదనకుండా ఇచ్చి దేవుడిగా మారాడు సోనూ. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ సమీపంలో ‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌’ పేరుతో పేద ప్రజలకు సేవలందిస్తున్నాడు. అందుకే సోనూసూద్‌ గొప్పమనసును గుర్తించిన తెలంగాణకు చెందిన కొందరు అభిమానులు ఏకంగా అతడికి గుడి కట్టించిన సంగతి తెలిసిందే.

Jr. NTR: చిత్రం సీక్వెల్‌లో న‌టించేది నితిన్ కాదంటా.. మ‌రెవ‌రంటే.. తెర‌పైకి మ‌రో కొత్త పేరు.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌..

Anjan Kumar Yadav : ‘ఊరూరు తిరుగుతా .. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తా’.. : కొత్త పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్

AP Weather Report : ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే..